కోవిడ్ వచ్చినప్పటి నుంచి చాలా మంది నోట మోకాళ్ల నొప్పులు వింటున్నాం. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు వచ్చాయని చాలా మంది అపోహ పడుతున్నారు. కారణాలు ఏవైనా ప్రస్తుతం 40 ఏళ్లు దాటిన వారందర్నీ కాళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. అలాగని నిత్యం యాంటిబయెటిక్స్ వాడితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇంటి వద్ద ఉంటూనే మోకాళ్ల నొప్పి తగ్గించుకోవచ్చు. ఆ మార్గాలు ఏంటో చూద్దాం..

ఆర్థరైటిస్, లేదా తేలికపాటి గాయాల వల్ల కలిగిన నొప్పి సాధారణంగా వైద్య సహాయం లేకుండానే తగ్గిపోతుంది.అయితే, నొప్పి మోస్తరు నుంచి ఎక్కువగా మిమ్మల్ని బాధపెడితే కచ్చితంగా వైద్యుడి వద్దకు వెళ్లాల్సిందే. మీ మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే ప్రత్యామ్నాయ చికిత్సలు గురించి తెలుసుకుందాం.
రైస్‌తో రిలాక్స్ : RICE
కాళ్లు నొప్పులు, ప్రమాదవశాత్తూ జారి పడితే రైస్ సూత్రాన్ని పాటించాలి. రైస్ సూత్రం అంటే ఏంటో తెలుసుకుందాం.
- Rest (విశ్రాంతి)
Ice (మంచు)
Compression (కుదింపు)
Elevation (ఎత్తివేయడం)
మీ కాళ్లకు విశ్రాంతినివ్వండి:

వాపును నివారించడానికి మీ మోకాలకు కాంప్రెషన్ బ్యాండేజ్ బిగించండి, అయితే రక్త ప్రసరణ ఆగిపోకుండా ఉండేలా చూడండి. మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, వీలేతే ఎత్తు ప్రదేశంలో ఉంచండి. విశ్రాంతి తీసుకునేటప్పుడు మీ కాళ్ల దగువున దిండు పెట్టుకోండి.
తాయి చీ (Tai Chi)
తాయి చీ అనేది ప్రాచీన చైనీస్ మైండ్-బాడీ వ్యాయామ విధానం, ఇది సమతుల్యత (balance) వంగే స్థితిని (flexibility) మెరుగుపరచుతుంది. తాయి చీ నొప్పిని తగ్గించడంలో మోకాలి కదలిక పరిమితిని పెంచడంలో సహాయపడుతుంది. దీని ద్వారా లోతైన శ్వాస , విశ్రాంతి పొందుతారు. ఈ లక్షణాలు ఒత్తిడిని తగ్గించడంలో దీర్ఘకాల నొప్పిని నిర్వహించడంలో కూడా సహాయపడతాయి.
వ్యాయామం: EXERCISE
రోజూ తగినంత వ్యాయామం చేయాలి. మీ కండరాలను బలంగా ఉంచడానికి ఇది సహాయ పడుతుంది. రోజూ కనీసం అరగంటైనా నడవాలి. సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్ ఏదో ఒకటి మీకు అనుకూలంగా ఉన్నది ఎంచుకుని ప్రయత్నించాలి.
బరువు నిర్వహణ :Weight Management
అధిక బరువు , ఊబకాయం (obesity) మీ మోకాళ్ల జాయింట్లపై అదనపు ఒత్తిడిని పెంచుతాయి. ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం, అదనంగా 10 పౌండ్లు బరువు పెరిగితే, జాయింట్‌పై 15 నుండి 50 పౌండ్ల వరకు ఒత్తిడి పెరుగుతుంది.
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య వల్ల మీ మోకాళ్లలో నొప్పి వస్తున్నట్లయితే, బరువు తగ్గించడం ద్వారా జాయింట్‌పై ఒత్తిడిని తగ్గించి లక్షణాలను ఉపశమనించవచ్చు.
వెచ్చని ,చల్లని చికిత్స (Heat and Cold Therapy)
విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మోకాళ్ల నొప్పిని ఉపశమనించడానికి వెచ్చని ప్యాడ్ (heating pad) ఉపయోగకరంగా ఉంటుంది. చల్లని చికిత్స (cold treatment) ప్రదహనాన్ని (inflammation) తగ్గించడంలో సహాయపడుతుంది.చల్లదనంతో, వెచ్చదనంతో మారుతూ చికిత్స చేయండి. వెచ్చని ప్యాడ్‌ను 20 నిమిషాల పాటు మాత్రమే ఉంచండి.గాయమైన తర్వాత మొదటి 2 రోజులు, 20 నిమిషాల పాటు చల్లని ప్యాడ్‌లను రోజుకు 4 నుంచి 8 సార్లు పెట్టండి.గాయం అయిన తొలి 24 గంటల్లో జెల్ ప్యాక్ లేదా చల్లని ప్యాక్‌ను ఎక్కువసార్లు ఉపయోగించండి.
ఐస్‌ను నేరుగా చర్మంపై పెట్టకూడదు: Ice Should not be Applied Directly to the Skin
వేడి ప్యాడ్ అనవసరంగా వేడిగా లేదని పరీక్షించి పెట్టండి.ఫ్లేర్ (లక్షణాలు తీవ్రమయ్యే స్థితి) సమయంలో జాయింట్ వేడిగా ఉన్నప్పుడు, వేడి చికిత్సను ఉపయోగించకూడదు.ఉదయాన్నే గోరువెచ్చని షవర్ లేదా స్నానం గట్టి జాయింట్లను సడలించవచ్చు.
సుగంధ ద్రవ్యాలతో (Herbal Ointment)
2011లో జరిగిన ఒక అధ్యయనంలో, పరిశోధకులు కింది పదార్థాలతో తయారైన మలహం నొప్పిని తగ్గించడంలో ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో పరిశీలించారు
దాల్చిన చెక్క (cinnamon),అల్లం (ginger), నువ్వుల నూనె (sesame oil) వినియోగంతో నొప్పులు తగ్గించుకోవచ్చు.ఏదైనా ప్రత్యామ్నాయ చికిత్సను ప్రయత్నించడానికి ముందు, డాక్టర్ లేదా ఫార్మసిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం.అల్లం టీ తరచూ తాగాలి. వంటల్లో కూడా అల్లం వినియోగించాలి. ఇలా తరుచూ చేస్తే మీ మోకాళ్ల నొప్పులు తగ్గడంలో సహాయపడతాయి.