- Kavi, Special Correspondent
నేడు ప్రధానంగా వేధిస్తున్న సమస్య అధిక బరువు. వెయిట్ లాస్ కోసం లక్షల్లో ఖర్చు చేసినవాళ్లూ ఉన్నారు. నాజూగ్గా మారాలని ప్రయత్నాలు చేస్తున్నవారు మనకు తెలిసివాళ్లే చాలా మంది ఉన్నారు. డైట్ కంట్రోల్ చేస్తున్నామని..ఫుడ్ తినడం తగ్గించేశామని, నిత్యం తినే ఆహారంలో చాలా పదార్థాలను దూరం పెట్టామని చెబుతుంటారు. అసలు నాజూగ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఏం తినాలి?? చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కేవలం 21 రోజుల్లోనే మీరు ఫలితం పొందవచ్చు. మీ శరీరంలో మార్పులు చూడొచ్చు.
కొవ్వుతో సమస్యలు-Problems ith Fat
ఒక వ్యక్తి శరీరంలో కొవ్వు అధికంగా చేరితే ఇబ్బందులు తప్పవు. డీహైడ్రేషన్, మెటాబాలిజం సమస్యలు, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు, గర్భధారణలో సమస్యలు అధిక వల్ల ఏర్పడతాయి. అందుకే ఏ డాక్టర్ వద్దకు వెళ్లినా ముందు మన వెయిట్ ఎంతో తెలుసుకుంటాడు.
ఇలా చేయండి..Do This..
తీపి పదార్థాలకు దూరంగా ఉండండి Stay Away From Sweets
ఉదయం లేచిన దగ్గర నుంచే బెడ్ కాఫీ మొదలు..రాత్రి డిన్నర్ అయ్యాక స్వీట్‌తో ముగిస్తారు చాలా మంది. ఇలా చేస్తే అధిక బరువు సమస్యలు కచ్చితంగా ఏర్పడతాయి. అందుకే మీరు చక్కెర వినియోగం తగ్గించాలి. చక్కెరలో ఉండే హై ఫ్రక్టోజ్ అధికంగా శరీరంలో కొవ్వును పెంచి డయాబెటీస్, గుండె సమస్యలకు కారణమవుతాయి.

రోజూ కనీసం 30 నిమషాలు నడవండి Walk For at Least 30 Minutes Every Day
మనలో చాలా మంది వాకింగ్ చేయరు. అసలు రోజూ వాకింగ్ చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అధిక బరువు, కొవ్వు కరగడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి.నడక అనేది చాలా సులభమైన , ప్రభావవంతమైన వ్యాయామం. 6.4 కిమీ/గం వేగంతో 30 నిమిషాలు నడవాలి.
జాగింగ్‌తో వేగంగా బరువు తగ్గించుకోవచ్చు -You Can Lose Weight Quickly by Jogging
జాగింగ్ , రన్నింగ్ వల్ల చాలా వేగంగా బరువు తగ్గించుకోవచ్చు. 8 కిమీ/గం వేగంతో పరుగెత్తడం వల్ల 30 నిమిషాల్లో 298 కాలరీలు తగ్గతాయి. ఇది ప్రాముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి సహాయపడుతుంది. రోజూ ఇలా చేయడం వల్ల త్వరగా నాజూగ్గా తయారవుతారు.
యోగాతో ఉపయోగాలు Uses With Ygga
యోగాతో కూడా అధిక బరువు తగ్గించుకోవచ్చు. నిత్యం ఉదయం లేవగానే కాసేపు యోగసనాలు వేస్తే ఈజీగా బరువు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మనసు ప్రశాంతత కూడా చేకూరుతుంది.
ఇంటి చిట్కాలు ఎంతో మేలు Home Tips are Very Good
1. దాల్చిన చెక్క టీ (Cinnamon Tea)
3-6 గ్రాముల దాల్చిన చెక్క పొడి నీటిలో మరిగించి, తేనె కలిపి ఉదయం మరియు రాత్రి తాగండి.
2. వాము నీరు (Ajwain for Weight loss)
రాత్రి వామును నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తాగండి..మంచి ఫలితం ఉంటుంది.
3. హర్బల్ టీ
జీలకర్ర, ధనియాలు, వాము, సోంపు కలిపి టీగా మరిగించి తాగండి.
గోరువెచ్చని నీరు తాగడం Drinking warm water
ఉదయం లేచిన వెంటనే వేడినీటిలో అర స్పూన్ నిమ్మరసం కలుపుకుని తాగాలి. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీరు తాగడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు.
అశ్వగంధా (Ashwagandha for Weight loss)
అశ్వగంధా ఆకుల పేస్ట్ తయారు చేసి, ఉదయాన్నే తాగితే ఒత్తిడితో పెరిగిన బరువును తగ్గించుకోవచ్చు.