Friday, June 20, 2025
Home Blog

నిద్రలో సైతం కలతలు: జంటల కో-స్లీపింగ్ సమస్యలు

0
Co-sleeping: A test of love? Problems and paths to harmony
Co-sleeping: A test of love? Problems and paths to harmony

ప్రపంచవ్యాప్తంగా అనేక మంది జంటలు ఒకే మంచంపై నిద్రించడం ద్వారా తమ అనుబంధాన్ని బలపరుస్తారు. ఇది ఒక ఆత్మీయమైన, స్నేహభావపూరిత అనుభూతి. అయితే, ఈ సహజమైన అనుబంధం కొన్ని సందర్భాల్లో నిద్రలేమి, అసౌకర్యాలు, భావోద్వేగ దూరానికి దారితీయవచ్చు. అదృష్టవశాత్తూ, ఈ సవాళ్లను ముందుగానే గుర్తించి, సరైన పరిష్కారాలను అన్వయించడం ద్వారా జంటలు కో-స్లీపింగ్‌ను విజయవంతంగా కొనసాగించవచ్చు. ఈ కథనంలో కో-స్లీపింగ్‌కు సంబంధించి జంటలు సాధారణంగా ఎదుర్కొనే ఐదు ప్రధాన సవాళ్లు, వాటి ప్రభావాలు, మరియు ఆచరణాత్మక పరిష్కారాలను చర్చించబోతున్నాం.

Co-sleeping is a challenge to couples’ relationships
1. భిన్నమైన నిద్ర వేళలు-Different bedtimes

సవాలు: ఒకరు రాత్రివేళ మేల్కొని ఉండగా, మరొకరు తెల్లవారుజామునే నిద్రలేస్తారు.
ప్రభావం: అలారాల శబ్దం, లైట్లు వెలిగించడం, తెరిచే తలుపులు వంటి చిన్నచిన్న చర్యలే జంట మధ్య నిద్రలేమికి దారితీయవచ్చు. దీర్ఘకాలంలో ఇది అలసట, చిరాకు, అసహనం, చివరికి సంబంధ ఉద్రిక్తతలకు కారణమవుతుంది.

పరిష్కారాలు: Solutions
నిశ్శబ్ద అలారాలు లేదా వైబ్రేటింగ్ వాచ్‌లు ఉపయోగించడం
తక్కువ కాంతి లైట్ల వాడకం
ఒకే సమయానికి నిద్రపోయే ప్రయత్నం చేయడం
2. గురక-snoring
సవాలు: ఒకరు గురక వేయడం మరొకరి నిద్రకు పెద్ద భంగాన్ని కలిగిస్తుంది.
ప్రభావం: గురక కారణంగా మరొకరు నిద్ర లేచిపోవడం, ఆ వ్యక్తిపై కోపం, దూరం పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
పరిష్కారాలు:Solutions

వైద్య సలహా తీసుకొని underlying కారణాలు తెలుసుకోవడం
పక్కకు తిరిగి నిద్రించే భంగిమను పాటించడం
ముక్కు స్ట్రిప్స్ లేదా నాసల్ డిలేటర్లు వాడటం

women on bed
women on bed
3.స్థల పరిమితి-Space limitation
సవాలు: మంచం చిన్నదిగా ఉండడం వల్ల ఇద్దరికీ సరైన స్థలం లభించదు.
ప్రభావం: ఒకరి కదలికలు మరొకరికి అంతరాయం కలిగించి, నిద్రలేమికి దారి తీస్తాయి. ఇది అసౌకర్యాన్ని, దూరాన్ని పెంచుతుంది.
పరిష్కారాలు:Solutions

పెద్ద పరిమాణం ఉన్న మంచం ఎంపిక చేసుకోవడం
వేర్వేరు దుప్పట్లు వాడటం
కదలికలు తక్కువగా చేసే మెమరీ ఫోమ్ పరుపుల వాడకం

4. ఉష్ణోగ్రత విభేదాలు-Temperature differences
సవాలు: ఒకరు చల్లదనం ఇష్టపడతే, మరొకరు వేడి కావాలనుకుంటారు.
ప్రభావం: ఈ తేడాలు ఇద్దరినీ అసౌకర్యానికి గురిచేసి, మెలకువలు మరియు చిరాకు కలిగిస్తాయి.
పరిష్కారాలు:Solutions

వేర్వేరు దుప్పట్లు (తక్కువ/అధిక మందం) వాడటం
రెండు వైపులా ఉష్ణోగ్రత సెట్ చేయగల split-AC లేదా స్మార్ట్ థర్మోస్టాట్ ఉపయోగించడం
ఒకరు కిటికీ తెరిచినచో, మరొకరు అదనపు దుప్పటిని వాడటం

couple on bed
couple on bed
. భావోద్వేగ దూరం-Emotional distance
సవాలు: వ్యక్తిగత ఒత్తిడి, విభేదాలు లేదా మనస్పర్థల వల్ల ఆత్మీయత తక్కువవుతుంది.
ప్రభావం: కో-స్లీపింగ్ ఒక బాధ్యతగా అనిపించటం, మానసికంగా దూరంగా ఉండటం.
పరిష్కారాలు:Solutions

నిద్రకు ముందు ప్రేమతో మాట్లాడుకోవడం
ధ్యానం, శ్వాస వ్యాయామాల వంటివి కలిసి చేయడం
బంధాన్ని బలోపేతం చేసే ఇతర చర్యలు (అరటి, హగ్, అభినందనలు)

sleeping
sleeping
6.ప్రేమతో నిద్రించే ప్రతి రాత్రి ఒక కొత్త అనుభ‌వం
Every night of sleeping with love is a new experienc
కో-స్లీపింగ్ అనేది నిద్ర మాత్రమే కాదు – ఇది బంధాన్ని, విశ్వాసాన్ని, మరియు సాన్నిహిత్యాన్ని పెంపొందించే ప్రక్రియ. కొన్ని చిన్న మార్పులు, పరస్పర అవగాహన, మరియు సహకారంతో జంటలు ఈ సవాళ్లను అధిగమించి తమ సంబంధాన్ని మరింత బలంగా, ఆనందంగా మార్చుకోవచ్చు. ప్రేమగా, ఓర్పుగా కలిసి నిద్రించే ప్రతి రాత్రి – మధురమైన కలలకే కాదు, బలమైన బంధానికి కూడా బీజం పడుతుంది.

చియా గింజ‌లతో ఇన్ని లాభాలా? మీరు ట్రై చేయండి

0
Are there so many benefits of chia seeds? You should try it
Are there so many benefits of chia seeds? You should try it

By: Amrutha

చియా గింజలు ఆరోగ్యానికి శక్తినిచ్చే సన్నగా కనిపించే అద్భుత గింజలు.చియా గింజలు ఖనిజాలు, ప్రోటీన్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉండే చిన్న చిన్న గింజలు. వీటిని ఓట్మీల్, తృణధాన్యాలు, పెరుగు లేదా స్మూతీల్లో చేర్చడం ద్వారా రోజువారీ ఆహారంలో సులభంగా ఉపయోగించవచ్చు.

What are chia seeds
What are chia seeds
చియా గింజలు అంటే ఏమిటి?
What are chia seeds?
చియా గింజలు సాల్వియా హిస్పానికా అనే పుదీనా కుటుంబానికి చెందిన మొక్క నుండి ఉత్పన్నమవుతాయి. ఇవి మధ్య అమెరికాకు చెందినవిగా, 5000 సంవత్సరాలుగా అజ్టెక్ మరియు మాయన్ సంస్కృతుల్లో ముఖ్యమైన ఆహారంగా ఉండేవి.
చియా గింజల ఆరోగ్య ప్రయోజనాలు
Health benefits of chia seeds
1.రక్తపోటును నియంత్రించడం
Controlling blood pressure
2. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం
Lowering cholesterol
3.జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం
Improving the digestive system
4.బరువు నిర్వహణలో సహాయం
Aid in weight management
5.డయాబెటిస్ నియంత్రణ
Diabetes control
6.దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ
Protection against chronic diseases
7.ఆందోళన, నిరాశ తగ్గించడంలో సహాయపడటం
Helping to reduce anxiety and depression
Health benefits of chia seeds
Health benefits of chia seeds
చియా గింజలలో ముఖ్యమైన పోషకాలు
Important nutrients in chia seeds

చియా గింజలు ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం (ALA) అనే ఒమేగా-3 రకాన్ని కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, వాపును తగ్గిస్తాయి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

ఫైబర్-Fiber

ఒక ఔన్స్ చియా గింజలలో సుమారు 9.8 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో, జీర్ణక్రియ మెరుగుపరచడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో సహాయపడుతుంది.

యాంటీఆక్సిడెంట్లు-Antioxidants

టోకోఫెరోల్స్, ఫైటోస్టెరాల్స్, కెరోటినాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాల నుంచి రక్షిస్తాయి.

ప్రోటీన్-Protein
చియా గింజలలో తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శక్తిని అందించడంలో మరియు రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి.

గుండె ఆరోగ్యం-heart health

చియా గింజల్లో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది దాని వలన గుండె జబులతో సహ అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది తగ్గించవచ్చు. దీని వలన గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది
Controls blood sugar levels

పరిశోధనలు తెలిపిన ప్రకారం, ఫైబర్ ఇన్సులిన్ రోగనిరోధకతను తగ్గించడంలో మరియు రక్తంలో షుగర్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. దీని వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ మరియు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గించవచ్చు. చియా లో కలిగిన బ్రెడ్, సాంప్రదాయ బ్రెడ్‌తో పోల్చితే, తక్కువ బ్లడ్ షుగర్ స్పందన వలన రక్తంలో షుగర్ అధిక స్థాయిలను నివారించడంలో సహాయపడుతుంది అని పరిశోధనలు తెలిపాయి.

More benefits of chia seeds
More benefits of chia seeds
బరువు తగ్గించడంలో సహాయపడవచ్చు
May help with weight loss

ఒక ఔన్స్ చియా గింజలలో రోజుకు అవసరమైన ఫైబర్ 35% వరకు ఉంటుంది. చియా గింజల్లో ఉండే ద్రవణీయ ఫైబర్ (soluble fiber) నీటిని శోషించుకుని కడుపులో విస్తరిస్తుంది. దీని వలన తిన్న తర్వాత ఎక్కువ సమయం పాటు కడుపు నిండినట్లుగా అనిపిస్తోంది. అందువల్ల ఎక్కువగా తినకుండా ఉండగలుగుతాం, తద్వారా ఆరోగ్యకరమైన బరువును నిలుపుకోవడంలో సహాయం చేస్తుంది.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు
Can improve skin health

చియా గింజల సారంలో విటమిన్ F అధికంగా ఉన్నట్టు తెలిసింది. ఇది చర్మ కార్యాచరణను మెరుగుపరచడంలో మరియు చర్మ తేమ నిలిపివుంచడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.

జలాభావాన్ని నివారించడంలో సహాయపడవచ్చు
May help prevent dehydration

చియా గింజల వంటి అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు తినేటప్పుడు ఎక్కువ నీటిని త్రాగడంలో సహాయపడుతుంది, ఇది జీర్ణ సమస్యలను నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.చియా గింజలకు నీటిని కలిపి త్రాగడం వలన మీరు హైడ్రేటెడ్‌గా ఉండగలుగుతారు, అదే సమయంలో గింజల్లోని పోషక ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు.

 

చియా గింజ‌ల‌తో మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు
More benefits of chia seeds

1.ఉచ్ఛిన్న కణాలను (ఫ్రీ రాడికల్స్) తట్టుకోగలవు

2.పొడిచిన వాపును (ఇన్‌ఫ్లమేషన్) తగ్గిస్తుంది

3.ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

రోజుకు ఎంత మొత్తం చియా గింజలు తినచ్చు?
How many chia seeds can you eat per day?
చియా గింజలు కొన్ని సమస్యలకు కారణమయ్యే అవకాశమున్నందున, చిన్న మోతాదుతో మొదలుపెట్టడం మంచిది. ప్రారంభంలో, ఒక్క టేబుల్ స్పూన్ (1 చెంచా) మాత్రమే ప్రయత్నించండి. తినడానికి ముందు అవి విస్తరించుకునేలా తయారుచేసుకోవడం తప్పనిసరి. చియా గింజలు తినడం వలన అధిక ప్రయోజనాలు ఉంటాయి, కాబట్టి ఒకసారి ప్రయత్నించండి…
How many chia seeds can you eat per day
How many chia seeds can you eat per day
మీ ఆహారంలో చియా గింజలను చేర్చడం ఎలా?
How to include chia seeds in your diet?
1.పెరుగు, సలాడ్, ఓట్స్, తృణధాన్యాలు వంటి ఆహారాల్లో చల్లడం
2.స్మూతీలు, పానీయాలు లేదా పాన్‌కేక్‌లలో కలపడం
3.చియా పుడ్డింగ్ రూపంలో తీసుకోవడం
4.చియా పుడ్డింగ్ – ఒక ఆరోగ్యకరమైన మిఠాయి
చియా పుడ్డింగ్ తయారీ విధానం
Chia pudding preparation method
పదార్థాలు:

చియా గింజలు – 2 టేబుల్ స్పూన్లు

పాల – 1/2 కప్పు (బాదం/సోయా/పాలు ఏవైనా)

తీపికర పదార్థం (అవసరమైతే)

బెర్రీలు, పుదీనా ఆకులు – అలంకరణకు

తయారీ:

పాలలో చియా గింజలు కలపండి.

జాడీలో వేసి బాగా కలపండి, 10 నిమిషాల తర్వాత మళ్లీ కలపండి.

కనీసం 15 నిమిషాలు లేదా రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచండి.

పైన తాజా పండ్లు, గింజలు, తీపికర పదార్థంతో అలంకరించండి.

కిస్‌కిస్ కిస్స‌క్‌..ముద్దైన పద్ధ‌తులెన్నో..

0
romantic kiss
romantic kiss

ముద్దైన పద్ధ‌తులెన్నో..

ప్రేమ పతాకం… మమతానురాగాల మధుర సంతకం ముద్దు. రెండు మనసుల మౌన సంభాషణం.. రెండు తనువుల మధ్య తొలి వలపుల సేతు బంధనం ముద్దు. అమ్మ మమతకు, నాన్న కరుణకు చెరగని గుర్తు బుగ్గలపై చిరు ముద్దు. కనులు కనులతో కలిసి, ఆపై వలపుల పూలు విరిసి, మనసులు మురిసి, మరులు కురిసి… చేతులు కలిసి, తనువులు చేరువయ్యే ఉబలాటంలో పెదాలు చేసే తొలి పలకరింపు తీని ముద్దు. ఆర్తుల నొసటన దేవుడి ప్రేమను ముద్రించేదీ.. అలసటతో, అలజడితో విసిగివేసారిపోయే వారి శిరసున ఆప్యాయతానురాగాలు వర్షించేదీ మమతల ముద్దు. ముద్దు మనిషి జీవితంలో ఓ మధుర స్పర్శ. మమతల శ్వాస. ఓసారి ఆప్యాయంగా, ఓపరి ఓదార్పుగా, ఓ పర్యాయం ఆనందంగా… లాలనగా, కాంక్షగా, తమకంగా, తృప్తిగా … ఇన్ని మధుర భావాల వ్యక్తీకరణకు సాధనమైన ముద్దు ప్రేమకు తుది సరిహద్దు. మరి ప్రేమను వ్యక్తీకరించే ముద్దైన‌ పద్ధతులేంటో తెలుసా మీకు?

Butterfly Kiss
Butterfly Kiss
బటర్‌ఫ్లై కిస్‌-Butterfly Kiss
సీతాకోకచిలుక మొహం మీద కదలాడితే ఎలా ఉంటుంది? ఈ ముద్దు అంత సుతారంగా ఉంటుంది. మీ ముఖాన్ని ముద్దు పెట్టుకునే ప్రియురాలి శ్వాస తగిలేంత చేరువగా తీసుకువెళ్లి.. ఆ సమయంలో ఆమె కనురెప్ప వాల్చిన వెంటనే తటాలున ముద్దు పెడితే మీరు ఆమెను ఎంత ఉద్వేగంతో ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది.

 

బుగ్గ మీద ముద్దు పెడితే..
If you kiss me on the cheek
cheek kiss
cheek kiss

ఇది స్నేహానికి సూచిక. ‘మనస్ఫూర్తిగా నీ స్నేహాన్ని కోరుకుంటున్నాను’ అని చెప్పడానికి బుగ్గ మీద ముద్దుతో ఎక్స్‌ప్రెస్‌ చెయ్యవచ్చు. మీ గర్ల్‌ ఫ్రెండ్‌ భుజాలు రెండూ పట్టుకుని కళ్లల్లో స్వేచ్ఛాభావాన్ని ప్రతిఫలింపజేస్తూ బుగ్గ మీద ముద్దు పెడితే ఆ బంధం మరింత బలబడుతుంది.

ఎస్కిమో కిస్‌-Eskimo Kiss
Eskimo Kiss
Eskimo Kiss

ఎస్కిమోలు ధ్రువ ప్రాంతాల్లో ఉంటారన్నది తెలిసిందే. వారు తమ భాగస్వామికి పెట్టే ముద్దును ఎస్కిమో కిస్సంటారు. ముక్కుకు ముక్కు రాసుకుంటూ ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకుంటూ నెమ్మదిగా కిస్‌ చేయడం చల్లగా.. కూల్‌గా ఉంటుంది కదా.

నయన చుంబనం
A kiss that expresses your love for your partner
love for your partner
love for your partner

మీ భాగస్వామిపై మీ ప్రేమను తెలియజేసే కిస్‌ ఇది. నిత్యం ఈ విధంగా ముద్దాడుకోవడం వల్ల ఒకరికి ఒకరు కలకాలం నిత్యనూతనంగా అనిపిస్తారు. గువ్వా గోరింకల్లా కువకువలాడతారు. చేరువైన తరుణంలో తన్మయంతో మీ ఇష్టసఖి కనురెప్పలు మూసుకున్నప్పుడు నెమ్మదిగా వెన్న దొంగలించిన కృష్ణుడిలా ముద్దాడాలి.

ఫింగర్‌కిస్‌-Finger kiss
Fingerkiss
Fingerkiss

భాగస్వామి డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఓదార్చే సమయంలో చేతిపై పెట్టే ముద్దును ఫింగర్‌ కిస్‌ అంటారు. ఈ తరహా ముద్దు భారాభర్తలిద్దరికీ భరోసా ఇస్తుంది.

పాదసేవనం-Foot service
Foot kiss
Foot kiss

శృంగార రసాస్వాదనలో కీలకమైన ఈ ముద్దు అలనాడు సత్యభామకు శ్రీకృష్ణుడు పెట్టిందే. శృంగారం తొలిమెట్టెక్కాక భాగస్వామి పాదాలను పెదాలతో మృదువుగా స్పృశిస్తే.. ఓహ్‌.. ఆ ఆనందమే వేరేగా ఉంటుంది. ఆ సంతోషం స్వర్గం అంచుల వరకు తీసుకువెళ్తుంది. మొహంలో కనిపించే ఆ ఫీలింగ్‌ మీలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. గిలిగింతలతో మొదలై.. అలా ఎటో సాగిపోయేందుకు ఈ ముద్దు ప్రేరణగా నిలుస్తుంది.

ఫ్రూట్‌ కిస్‌-Fruit Kiss
Fruit Kiss
Fruit Kiss
ఆరోగ్యకరమైన ఈ కిస్‌ ఇంట్లో చేసిన ఫ్రూట్‌ సలాడ్‌ తిన్నట్టుంటుందంటే నమ్మండి! ద్రాక్ష, మామిడి, పైనాపిల్‌ పండ్లను చిన్న ముక్కలుగా తీసుకోండి. భాగస్వామి నోటికి ఒక్కో ముక్కను అందిస్తూ. వాటిని మునిపంట నొక్కి ముక్కలు చేస్తూ, ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తే శృంగారోద్దీపన బాగా జరుగుతుంది.

ఆగి ఆగి ముద్దాడుతూ-Stop and stop kissing

Stop and stop kissing
Stop and stop kissing

ఒకరి పెదాలతో ఒకరు మాటాడుకుంటున్నట్టు.. ఆగి ఆగి ముద్దాడే ఈ పద్ధతిలో బోలెడంత రిలీఫ్‌ దొరుకుతుందని మానసిక శాస్త్రవేత్తల ఉవాచ. ముద్దాడే వ్యక్తిని సున్నితంగా పట్టుకుని కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ, మనసులోని భావాలను వ్యక్తం చేస్తూ.. చిరుముద్దులు పెట్టుకునే విధానమిది. ఈ రకం కిస్‌ ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకునేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ఈ ముద్దు వల్ల ఆవేశం..కోపం చాలామట్టుకు తగ్గతుందంటున్నారు.

హాట్‌ అండ్‌ కూల్‌ కిస్‌-Hot and cool kiss
Hot and cool kiss
Hot and cool kiss

ఇది పడకగదిలో పెట్టుకునే కిస్‌. మీ భాగస్వామి దిగువ పెదవి మీ రెండు పెదాలతో అందుకుని మునిపంట నొక్కి పెట్టుకునే ముద్దు ఇది. ఇది చాలా ఉద్రేక పరిచే ముద్దు.

చిరు ఆభరణం-Small ornament
మీ భాగస్వామి మెడపై ఎన్ని ఆభరణాలున్నా.. మృదువుగా పెట్టుకునే ముద్దు ఇచ్చే అందం ఇంకేదిస్తుంది చెప్పండి? కంఠానికి ఇరువైపులా పెట్టే ఈ ముద్దు చల్లని ఒక శ్వాసలా అలరిస్తుంది. పేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఇందలో ఏ మాత్రం కామవాంఛ, మోహం ఉండవు. సంతోషం అతిశయిస్తే ఈ ముద్దు పెదాలపై ఓ ప్రభాత దరహాసంలా ఉదయిస్తుంది.
రివర్స్‌లిప్‌ కిస్‌-Reverse slip kiss
Firefly kiss
Firefly kiss

ఇది ప్రేమికుల ముద్దు. ప్రియురాలి అలక తీర్చడానికి ప్రియుడు ఈ రివర్స్‌ లిప్‌ కిస్‌ను ఉపయోగించుకుంటాడు. ప్రేయసి కుర్చీలో తల వెనుకకువాల్చి రిలాక్స్‌ అవుతున్న తరుణంలో… ప్రియుడు ఆమె వెనుక నుంచి వచ్చి.. వదనంపై పెదాలు ఆన్చి.. రెండు చేతుల్తో ఆమె మెడను పట్టుకుని దిగువ పెదవిపై తడి పెదాలతో ముద్దాడితే ఇక అలక తుర్రుమంటుంది.

తుమ్మెద ముద్దు-Firefly kiss
తమకం ఎక్కువై.. ప్రేయసిని ముద్దులతో ముంచెత్తే పద్ధతిది. మెడకు ఎడమవైపున లేదా, కుడివైపు కింద భాగంలో ముద్దు పెట్టుకుంటే అది తుమ్మెద ముద్దవుతుంది. పూవులో మకరందాన్ని. తుమ్మెద జుర్రుకునే విధంగా సాగే ఈ ముద్దు మత్తెక్కిస్తుంది. బుగ్గపై నెమ్మదిగా చేతితో నిమురుతూ పెదాలతో పెదాలను స్పృశిస్తే.. నువ్వంటే నాకు చాలాచాలా ఇష్టమని చెప్పకనే తెలిసిపోతుంది.

 

ముద్దుతో గుడ్‌ మార్నింగ్‌-Good morning with a kiss
Good morning with a kiss
Good morning with a kiss
చెంతనే ఉన్న సహచరి నిద్రలో ఊయలలూగుతున్న వేళ.. ఉదయాన్నే.. మృదువుగా గుడ్‌ మార్నింగ్‌ చెబుతున్నట్టు.. కనురెప్పలపై ముద్దుపెడుతూ నిద్రలేపండి….. ఇక ఆ రోజంతా ఉల్లాసమే.. మదిలో ఉత్సాహమే. అయినా భాషకందనిది.. భావాలకు అతీతమైనది ముద్దు.. దానికి డెఫినిషన్లు ఏమిటంటారా? మీ ముద్దు.. మీ ఇష్టం!
ముద్దు ముద్రలు-Kiss impressions
  1. చేతిమీద ముద్దు పెడితే…నీకోసం నే జీవిస్తున్నాను అని చెప్పడానికి
    బుగ్గమీద ముద్దు పెడితే… మేం స్నేహితులం అని చెప్పేందుకు
    నుదిటమై ముద్దు పెడితే..ఆత్మీయతానురాగాలకు ప్రతీక
    మెడపై ముద్దు పెడితే…నువ్వునాక్కావాలి అని చెప్పడానికి
    పెదాలపై ముద్దు పెడితే…నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి
    చెవిపై ముద్దాడితే…ఆనందంగా వున్నాను అనిచెప్పడానికి.

మ‌నిషికి పంది కాలేయం

0
Pig liver for humans
Pig liver for humans
  • By: Amrutha, Bengaluru

ఇంతవరకు మనం మనిషి నుంచి మరో మనిషికి కాలేయం మార్పిడి చేయడమే చూశాం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు పంది కాలేయాన్ని కూడా మనుషుల శరీరంలో మార్పిడి చేయగలుగుతున్నాం. వైద్య రంగంలో అనేక సంవత్సరాలుగా వైద్యులు వివిధ రకాల అంగమార్పిడి (ట్రాన్స్‌ప్లాంటేషన్)లను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. జెనెటికల్‌గా మూత్రపిండాలు, హృదయాలను రోగులకు ఇంకొక విధంగా ఇచ్చారు. ఇప్పుడు, మన ప్రయోజనం కోసం చైనాలోని డాక్టర్లు ఇంకా శాస్త్రవేత్తలు కలిసి ఒక పంది కాలేయాన్ని ఇటీవ‌ల‌ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.

Helping a liver that has been injured in the future
Helping a liver that has been injured in the future
బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తికి పంది కాలేయం అమ‌రిక‌
Pig liver transplant for brain-dead man

మన శాస్త్రవేత్తలు ఒక జెనెటికల్‌గా సవరించబడిన పంది కాలేయాన్ని బ్రెయిన్-డెడ్ రోగికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. సంబంధిత రోగి కుటుంబ స‌భ్యులు వైద్య బృందం విజ్ఞ‌ప్తిని మ‌న్నించారు. దీంతో బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తికి పంది కాలేయాన్ని అమ‌ర్చారు. ఇది విజ‌య‌వంతం అయింది. ప‌ది రోజుల త‌రువాత కుటుంబ స‌భ్యుల అభ్య‌ర్థ‌న మేర‌కు పంది కాలేయాన్ని తొల‌గించారు. రోగికి అస‌లు కాలేయాన్ని తీసివేయ‌లేదు. కేవ‌లం ప్ర‌యోగానికి మాత్ర‌మే బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తిని వైద్యులు వినియోగించుకున్నారు. మాన‌వ కాలేయానికి ప్ర‌త్యామ్నాయంగా పంది కాలేయం అమర్చొచ్చ‌ని వైద్యుల ప్ర‌యోగంలో తేలింది.

భ‌విష్య‌త్తులో గాయ‌ప‌డిన కాలేయానికి సాయం
Helping a liver that has been injured in the future
Pig liver transplant
Pig liver transplant

పంది కాలేయం విజయవంతంగా జీర్ణ రసము స్రవించి, మన కాలేయం నుంచి అల్బుమిన్ ఉత్పత్తి చేసింది. ఇది మనకు గొప్ప విజయంగా కనిపిస్తోంది.. ఈ అనుభవం, పంది కాలేయం మనిషి శరీరంలో అసలైన కాలేయంతో కలిసి పనిచేయగలదని, భవిష్యత్తులో గాయపడిన కాలేయానికి సహాయం చేయగలదని భావిస్తున్నారు.

రోగ నిరోధ‌క శ‌క్తి లేమి-Immune deficiency

liver transplant
liver transplant

పంది అవయవాలు , మనిషి శరీరంలో ఉపయోగించడం సాధ్యమైనప్పటికీ, పంది అవయవాలు మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తిని అధిగమించలేకపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి, శాస్త్రవేత్తలు పందులను జెనెటికల్‌గా మార్పులు చేసి అవయవాలను అందిస్తున్నారు. ఈ ప్రత్యేక రోగి ప్రయోగంలో, పంది కాలేయాన్ని మూడు ముఖ్యమైన జన్యుపరిష్కరణలతో మార్పులు చేసి అందించారు. ఈ ప్రక్రియ ద్వారా పంది కణాలు రోగి శరీరంలో అంగీకరించేందుకు కావలసిన మార్పులు చేశామ‌ని నిపుణులు చెప్పుతున్నారు.

మ‌రిన్ని ప్ర‌యోగాలు-More experiments
Pig liver transplant surgery
Pig liver transplant surgery
పంది కాలేయం అమర్చిన‌ప్పుడు రోగికి రోగ‌నిరోధ‌క శ‌క్తిలేక‌పోవ‌డంతో దీనిపై వైద్య బృందాలు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాయి. ప్రస్తుతం మానవ కాలేయాన్ని తీసి పంది కాలేయాన్ని భర్తీ చేయడానికి ప్రయోగాలు చేయబడుతున్నాయి. “ఇది నిజంగా గొప్ప సాధన, ఎందుకంటే పంది కాలేయం, మరింత మందికి వాడకానికి అనుకూలంగా తయారవుతుందని వైద్యులు చెబుతున్నారు.
దీర్ఘకాలిక మనుగడ
Can you live 40 years after a liver transplant?
కాలేయ మార్పిడి తర్వాత గ్రహీతలు 30 సంవత్సరాలకు పైగా సాధారణ జీవితాన్ని గడిపిన సందర్భాలు ఉన్నాయి, మరియు కొందరు 40 సంవత్సరాలకు పైగా కూడా జీవించారు.
కాలేయ మార్పిడికి ఎంత ఖ‌ర్చు అవుతుంది
What is the cost of a liver transplant?
సాధార‌ణంగా కాలేయ మార్పిడి ప్రాణాలను కాపాడే ప్రక్రియ అయినప్పటికీ, మార్పిడి తర్వాత గ్రహీత ఎంతకాలం జీవిస్తారనేది వ్యక్తి యొక్క ఆరోగ్యం, మందుల వాడకానికి కట్టుబడి ఉంటుంది. వారి కాలేయ వ్యాధికి గల అంతర్లీన కారణంతో సహా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే పంది కాలేయం అమ‌ర్చిన రోగుల‌కు ఇది ఎంత‌కాలం ప‌నిచేస్తుంద‌న‌డానికి ఇంకా ఎటువంటి ఆధారాలు లేవు. ఇంకా ఈ ప్ర‌యోగం ప్రారంభ దశ‌లోనే ఉంది.
రూ.20 నుంచి రూ.30 ల‌క్ష‌లు
Rs.20 to Rs.30 lakhs
భార‌త దేశంలో కాలేయ మార్పిడికి రూ.20 ల‌క్ష‌ల నుంచి రూ.30 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కాలేయ మార్పిడికి ఏ దేశం బెస్ట్
Which country is best for liver transplant?
తుది దశ కాలేయ వ్యాధి ఉన్న రోగులకు కాలేయ మార్పిడి అనేది ప్రాణాలను కాపాడే చికిత్స. నైపుణ్యం కలిగిన సర్జన్లు, అధునాతన సౌకర్యాలు, అధిక విజయవంతమైన రేట్లకు ప్రసిద్ధి చెందిన భారతదేశం, టర్కీ, స్పెయిన్ వంటి దేశాలు తరచుగా కాలేయ మార్పిడిలో అగ్ర‌గామిగా ఉన్నాయి. పరిగణించబడుతున్నాయి. భారతదేశంలో కాస్త ఎక్కువ ఖ‌ర్చు చేయాల్సిన పరిస్థితి.
ఏ ఆస్ర‌త్రుల్లో లివ‌ర్ ప్లాంటేష‌న్ చేస్తారు
In which hospitals is liver transplantation performed?
భార‌త‌దేశంలో ప్ర‌ముఖంగా ఉన్న అపోలో హాస్పిటల్స్, మాక్స్ హెల్త్‌కేర్, ఆర్టెమిస్ హాస్పిటల్, మేదాంత హాస్పిటల్ , రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వంటివి భారతదేశంలోని కొన్ని ప్రముఖ కాలేయ మార్పిడి కేంద్రాలు.

పంది కాలేయ మార్పిడికి ఎంత ఖ‌ర్చు అవుతుంది
How much does a pig liver transplant cost?

సాధార‌ణ మ‌న భార‌త దేశంలో కాలేయ మార్పిడికి సుమారు రూ.30 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచనా. పంది కాలేయ మార్పిడి విజ‌య‌వంత‌మైతే ఇంత ఖ‌ర్చు చేయ‌న‌వ‌స‌రం లేద‌ని వైద్యులు చెబుతున్నారు. ఇది సామాన్య ప్ర‌జ‌ల‌కు అందుబాట‌లోకి వ‌చ్చే సాధార‌ణ వైద్యంలాగే కాలేయ మార్పిడికి ఖ‌ర్చు చేయ‌గ‌లిగే ప‌రిస్థితి ఉంటుంది.

కాలేయ స‌మ‌స్య‌లకు చెక్‌
Check for liver problems
ఈ ప్రయోగం విజయవంతం అయితే… పంది కాలేయాన్ని పూర్తిగా మానవ కాలేయాన్ని‌ను మార్పిడి చేసి ఉంచితే, కాలేయాన్ని సమస్యలతో బాధపడుతున్న చాలా మందిని కాపాడగలుగుతాము.

Frequently Asked Questions(FAQ’s)
  • Pig Liver Transplanted Into Human Body After Gene Editing
    Can a pig’s liver be transplanted into a human?
    Can a person have a liver transplant?
    Can you live 40 years after a liver transplant?

హెయిర్ ప్రాడెక్ట్స్ మీ జుత్తును కాపాడ‌గ‌ల‌వా

0
hair

మీ జ‌ట్టు న‌ల్ల‌గా మారాలా? తెల్ల‌వెంట్రుక‌లు మ‌టుమాయం..మీ జుట్టు ఊడిపోతున్నా మేమున్నాం. మాప్రాడెక్ట్ వాడితే తెల్ల‌గా ఉన్న జ‌ట్టు న‌ల్ల‌గా మారిపోతుంది. ఆ ఆయిల్ వాడితే మీ జుట్టులో ఒక్క తెల్ల వెంట్రుక కూడా ఉండ‌దు. మీ జుత్తు ఊడిపోతుంద‌న్న బాధ‌కు మాద‌గ్గర స‌మాధానం ఉంది. సోష‌ల్ మీడియా ద‌గ్గ‌ర నుంచి టీవీలో యాడ్స్ వ‌ర‌కు మ‌న‌ల్ని ఊద‌ర‌గొడుతూనే ఉంటాయి. ఇవి నిజ‌మేన‌ని చాలా మంది ఆయా ప్రాడెక్ట్‌ల‌ను కొనుగోలు చేసేందుకు వేల‌కు వేల‌కు ఖ‌ర్చు చేస్తున్నారు. అయినా ఫ‌లితం పొందుతున్నారా? అంటే వంద‌మందిలో ఒక‌రిద్ద‌రు మిన‌హా మిగిలిన వాళ్ల నుంచి ఔను అన్న సమాధానం రాదు. అందుకే ఈ క‌థ‌నం మీకోసం..

HAIR
HAIR

స్ప్లిట్ ఎండ్స్ అంటే-What are split ends?

స్ప్లిట్ ఎండ్స్ అంటే వెంట్రుకలకు చర్మంపై మొటిమలు వచ్చినట్టు. అయితే శ‌రీర‌త‌త్వం..మ‌నం తీసుకునే ఆహారం కార‌ణంగా ప్ర‌భావం చూపుతాయి. దీనినే క్యాష్ చేసుకుంటున్నాయి మార్కెట్లో హెయిర్ కేర్ ప్రాడెక్టులు. అయితే ఇదంతా డ్రామానేనా? అంటే ఔన‌నే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మీ జుత్తు నాణ్య‌త ఎలా గుర్తించాలి-How to Determine the Quality of Your Hair

మీ జట్టు చివ‌రి భాగాల‌ను ప‌రిశీలించండి. అవి రెండు లేదా అంత‌కంటే ఎక్కువ భాగాలుగా చీలిపోయిన ఉంటే అది స్ప్లిట్ ఎండ్స్ గా భావించ‌వ‌చ్చు. వెంట్రుకల బాహ్య రక్షణ పొర (క్యూటికల్) దెబ్బతింటే స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. ఈ రక్షణ పొర లేకుండా, లోపలి కార్టెక్స్ బయటికి తెరిచిపడుతుంది. ఇది వెంట్రుకలను బలహీనపరిచి చివరలు చీలిపోయేలా చేస్తుంది.

BLACK HAIR
BLACK HAIR
ఈ చీలిక నాలుగు ర‌కాలు-There are four types of this fissure

బేసిక్ స్ప్లిట్: వై-ఆకారంలో చీలిక ఇది. ఇది క్యూటికల్ విడిపోయినప్పుడు కనిపిస్తుంది

ఫెదర్ స్ప్లిట్: ఒకే వెంట్రుకపై అనేక చీలికలు, ఇది తీవ్రమైన క్యూటికల్ నష్టాన్ని సూచిస్తుంది.

ట్రీ స్ప్లిట్: ఒకే బిందువు నుంచి అనేక చిన్న చీలికలు, ఇవి సాధారణంగా అత్యధికంగా ఎండిపోవడం వల్ల వస్తాయి.

నాటెడ్ స్ప్లిట్: వెంట్రుక గడ్డ కట్టుకోవడం, ఇది కర్లీ లేదా కాయిలీ హెయిర్ టైప్‌లో ఉంటుంది.

వీటికి గ‌ల కార‌ణాలేంటి?-What Are the Reasons for These?

HAIR BEAUTY
HAIR BEAUTY

హీట్ స్టైలింగ్: ఫ్లాట్ ఐరన్లు, బ్లో డ్రైయర్ల వంటి స్టైలింగ్ టూల్స్ వల్ల అధిక వేడి కారణంగా వెంట్రుకలను బలహీనపరుస్తుంది. ఎక్కువ వేడి లేదా రక్షణ లేకుండా తరచుగా హెయిర్ డ్రేయర్స్ వాడితే వెంట్రుకలు లోపలి నుంచి పొంగుతాయి. ఇది క్యూటికల్ ను పగులకొట్టి, లోపలి భాగాన్ని బయటికి తెరుస్తుంది.

గ‌ట్టిగా దువ్వినా క‌ష్ట‌మే-It’s Hard to Comb it Tightly

చాలా మంది మ‌న ఇళ్ల‌ల్లో ముఖ్యంగా పిల్ల‌ల విష‌యంలో త‌ల్లులు గ‌ట్టిగా దువ్వ‌డం చూస్తూంటాం. అలా చేస్తే జుత్తుకు చాలా న‌ష్టం. గ‌ట్టిగా దువ్వడం, టైట్ హెయిర్ స్టైల్స్ త‌ర‌చూ వినియోగిస్తే భౌతిక ఒత్తిడులు గురికాక‌త‌ప్ప‌దు.

కెమికల్స్ తో నష్టం-Damage Caused by Chemicals

ఇప్పుడు 25 ఏళ్లు నిండ‌క‌ముందే జుత్తు తెల్ల‌బ‌డుతుంది. లేదా రంగు మారుతుంది. పొల్యూష‌న్, నిద్ర‌లేమి, ఒత్తిడి ఈ మూడుకార‌ణంగా కురుల్లో మార్పులు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్య‌లో చాలా మంది కలరింగ్, బ్లీచింగ్, హెయిర్ రిలాక్సింగ్ వంటి ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. దీంతో వెంట్రుకల సహజ నిర్మాణాన్ని విచ్ఛిన్నమ‌వుతున్నాయి.

మీ జుత్తును మార్చే శ‌క్తి ఉందా?-Do You Have the Power to Change Your Hair?

మార్కెట్లో ఊద‌ర‌గొడుతున్న ప్రాడెక్ట్స్ కేవ‌లం ప్ర‌చారానికి మాత్ర‌మే. నిజంగా మీజుత్తును మార్చే శ‌క్తి వాటికి లేదు.అయితే పూర్తిగా న‌యం చేయ‌న‌ప్ప‌టికీ కొన్ని కండిషనర్లు, లీవ్-ఇన్ ట్రీట్మెంట్లు వాటి రూపాన్ని తగ్గించగలవు.

 

అంధులు ఇక చూడొచ్చు

0
EYE
  • ప్ర‌పంచాన్నీ వీక్షించ‌వ‌చ్చు
    వైద్య శాస్త్రంలో అద్భుతం
    అంధులు చూడ‌గ‌లిగేలా బ్లైండ్ సైట్ చిప్‌
  • అంధుల‌కు శుభ‌వార్త‌. ఇక‌పై అంధులు కూడా ప్ర‌పంచాన్ని చూడొచ్చు. అందాలు వీక్షించ‌వ‌చ్చు..త‌మ త‌ల్లిదండ్రులు ఎలా ఉంటారో చూడొచ్చు..స్నేహితుల‌తో క‌లిసి సినిమా చూడొచ్చు. విహార యాత్ర‌ల‌కు వెళ్లొచ్చు. వైద్య‌రంగంలో శాస్త్ర‌వేత్త‌ల అపూర్వ సృష్టికి అంధులంతా జేజేలు పలికే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది. 2025నాటికి అంధుల‌కు బ్లైండ్ సైట్ చిప్ అమ‌ర్చేందుకు రంగం సిద్ధమైంది. దీని గురించి మ‌రిన్ని వివరాలు తెలుసుకుందాం.
  • BLIND CHIP
    BLIND CHIP
  • బ్లైండ్‌సైట్ అంటే ఏమిటి?-What is BlindSight?

‘బ్లైండ్‌సైట్’ అనేది ఒక కృత్రిమ దృశ్య ప్రోస్తేసిస్ (Artificial Visual Prosthesis), ఇది నేరుగా మెదడులోని విజువల్ కార్టెక్స్‌లో అమర్చబడుతుంది. ఇది ఒక మైక్రోఎలక్ట్రోడ్ చిప్, ఇది కెమెరా నుంచి అందుకున్న సిగ్నల్‌ను ప్రాసెస్ చేసి మెదడులో దృశ్య చిత్రాన్ని సృష్టిస్తుంది. అంటే, ఆప్టిక్ నరాలు దెబ్బతిన్న లేదా రెండు కళ్ళు లేని వారు కూడా చూడగలరు.

ఈ చిప్ ఎలా పనిచేస్తుంది?-How Does This Chip Work?
BLIND WOMEN
BLIND WOMEN

విజువల్ కార్టెక్స్‌లోని ఎలక్ట్రోడ్ల ద్వారా న్యూరాన్‌లను ప్రేరేపిస్తుంది. బాహ్య కెమెరా నుంచి అందుకున్న డేటాను ప్రాసెస్ చేసి మెదడులో దృశ్య చిత్రాన్ని రూపొందిస్తుంది. ప్రారంభంలో ‘అటారీ గ్రాఫిక్స్’ వంటి తక్కువ-రిజల్యూషన్ చిత్రాలు కనిపిస్తాయి, కానీ కాలక్రమేణా ‘సూపర్ హ్యూమన్ విజన్’ వరకు చేరుకోవచ్చు.

ఈ ఏడాది చివ‌రినాటికి-By The End Of This Year
BLINDI woman
BLINDI woman
ఈ ఏడాదిచివ‌రినాటికి అంధులు చూడ‌గ‌లిగే మొద‌టి ప‌రిక‌రాన్నిఅందుబాటులో తీసుకువ‌చ్చేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని యూస్‌లో జ‌రిగిన శాస్త్ర‌వేత్త‌ల స‌మావేశంలో ఎలాన్‌మ‌స్క్ అనే శాస్త్ర‌వేత్త వెల్ల‌డిచారు. ఇప్ప‌టికే దీనిపై ప‌రిశోధ‌న‌లు పూర్తి చేశామ‌ని, ప్ర‌స్తుతం ట్రైల్ ర‌న్‌లో ఉంద‌ని వెల్ల‌డించారు. బ్లైండ్‌సైట్ అంధులకు “అటారీ గ్రాఫిక్స్” వంటి తక్కువ-రిజల్యూషన్ దృష్టిని మాత్రమే అందించగలదని చెప్పారు.

తక్కువ రిజ‌ల్యూష‌న్‌తో ప్రారంభం-Start With Low Resolution

తొలుత త‌క్కువ రిజ‌ల్యూష‌న్‌తో బ్లైండ్ సైట్ చిప్ అందుబాటులోకి రానుంది. క‌ళ్ల‌కు ఇబ్బంది లేకుండా రూపుదిద్దుకుంటోంది. కాల‌క్ర‌మేణా ఇప్లాంట్ చివ‌రికి మాన‌వాతీత‌మైన దృష్టికి సాయ‌ప‌డుతుంది.

రెండు క‌ళ్లు కోల్పోయినా వారు కూడా..-Even if They Lose Both Eyes

EYE
EYE

రెండుక‌ళ్లు కోల్పోయిన వారు..ఆప్టిక్ న‌రాలు కోల్పోయిన వారు కూడా చూడ‌గ‌లిగేలా బ్లైండ్ సెట్ చిప్ అందుబాటులోకి రానుంది. పుట్టుకతోనే అంధులైన వారు కూడా మొదటిసారిగా చూడగలిగేలా చేస్తుంది.

న‌రాల క‌ణాల‌ను ప్రేరేపిస్తుంది-Stimulates Nerve Cells
బ్లైండ్ సైట్ చిప్ అత్యాధునిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. విజువ‌ల్ కార్ట‌క్స్ పొందుప‌రిచారు. మైక్రోఎల‌క్ట్రోడ్ శ్రేణి క‌లిగి ఉంది. ఇది దృశ్య డేటాను ప్రాసెస్ చేస్తుంది. మెద‌డులోని భాగం..కెమెరా నుంచి ప్ర‌సారం చేయ‌బోయే న‌మూనాల ఆధారంగా విజువ‌ల్ కార్టెక్స్‌లో ఉన్న న్యూరాన్లు, న‌రాల క‌ణాలను ప్రేరేపిస్తుంది.

ఎఫ్‌డీఏ ఆమోద ముద్ర‌-FDA Seal of Approval

బ్లైండ్ సైట్ చిప్ ను చాలా రోజులుగా ప‌రిశీలించిన అనంత‌ర గ‌త ఏడాది సెప్టెంబర్‌లో యూస్ ఫుడ్ అడ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ బ్రేక్ త్రూ హోదాను మంజూరు చేసింది. ప్రాణాంత‌క ప‌రిస్థితుల‌కు చికిత్స‌, రోగనిర్థార‌ణ అందించే ప‌రిక‌రాలను ప‌రిశీలించి ఆమోదముద్ర వేసేందుకు ఎఫ్‌డీఏ ప్ర‌శంస‌మైన పాత్ర పోషిస్తోంది.

ఈ చిప్ విజ‌య‌వంత‌మైతే..-If This Chip is Successful

నిజంగా ఈ చిప్ విజ‌య‌వంత‌మైతే వైద్య‌శాస్త్రం, న్యూరోటెక్నాల‌జీలో చారిత్రాత్మ‌క విప్ల‌వానికి దారి తీస్తుంద‌ని చెప్పొచ్చు. మొద‌టిసారి అంధులు ప్ర‌పంచాన్ని చూసే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌స్తుతం కొంద‌రు అంధుల‌పై ఈ ప్ర‌యోగం చేయ‌నున్నారు. ఇది విజ‌యంతమైతే మార్కెట్లోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

రీల్స్ చూస్తున్నారా? అయితే క‌ష్టం బ్రో

0
reelswatching
అదే ప‌నిగా రీల్స్ చూస్తున్నారా? ఒక్క వీడియో…మ‌రొక్క వీడియో అంటూనే గంట‌ల కొద్దీ రీల్స్‌కు బానిస‌వుతున్నారా? అయితే మీ క‌ళ్లు జాగ్ర‌త్త‌. రీల్స్ వీక్షించ‌డ కార‌ణంగా యువ‌కుల్లో కంటి ర‌గ్మ‌తులు పెర‌గ‌డానికి అవ‌కాశం ఉంద‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. మొబైల్ చూడ‌డం వేరు…రీల్స్ చూడ‌డం వేరు. రీల్స్ చూసేట‌ప్ప‌డు మ‌న క‌ళ్లురెప్ప వాల్చ‌కుండా స్క్రీన్‌ను వీక్షించ‌డం కార‌ణంగా క‌ళ్ల‌కు తీవ్ర‌మైన ఒత్తిడి పెరుగుతోంది. నిరంత‌రం స్క్రీన్ చూడ‌డంతో ఫిక్స‌నేష‌న్ రెప్ప‌పాటు రేటును 50 శాతం త‌గ్గిస్తుంది.
REELS WATCHING
REELS WATCHING
రీల్స్ చూడ‌డం కొన‌సాగిస్తే…-If you Continue Watching Reels…
అదే ప‌నిగా రీల్స్ చూడ‌డం కొన‌సాగితే దృష్టి స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. చిన్న-రూప వీడియోల ప్రభావం మానసిక ఆరోగ్యంపై ఆందోళనలను రేకిత్తిస్తుంద‌ని తాజా ప‌రిశోధ‌న‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి.

 

పిల్ల‌ల‌కు ఎక్కువ న‌ష్టం-Children Suffer The Most
EYE PROBLEM
EYE PROBLEM
ఇప్పుడు పిల్ల‌లు సెల్‌ఫోన్ల‌కు ఎడిక్ట్ అవుతున్నారు. స్కూల్ నుంచి రాగానే త‌మ త‌ల్లిదండ్రులు ఫోన్లు తీసుకుని రీల్స్ చూస్తున్నారు. గేమ్స్ ఆడుతున్నారు. ఇన్‌స్ట్రా గ్రామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్ వంటి సోష‌ల్ మీడియాలో రీల్స్‌ను ఎక్కువ‌గా చూడ‌డం వ‌ల్ల పిల్ల‌లు, యువ‌కుల్లో కంటి రుగ్మ‌త‌లు పెరుగుతున్నాయి. యశోభూమి – ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌లో ప్రముఖ నేత్ర వైద్యులు ఈ విష‌యంపైనే ప్ర‌ధానంగా చ‌ర్చించుకున్నారు.

పిల్ల‌ల కళ్ళు వంకరగా..-The Children’s Eyes Are Crooked

ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మోలజీ (APAO) 2025 కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ లలిత్ వర్మ అధిక స్క్రీన్ ఎక్స్‌పోజర్ వల్ల కలిగే ‘డిజిటల్ కంటి ఒత్తిడి యొక్క నిశ్శబ్ద మహమ్మారిస పై తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. “రీల్స్‌ను గంటల తరబడి చూసే పిల్లలలో పొడి కంటి సిండ్రోమ్, మయోపియా పురోగతి, కంటి ఒత్తిడి మరియు ప్రారంభ దశలో కళ్ళు వంకరగా అవ్వడం వంటి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి” అని పేర్కొన్నారు.

నివారించ‌క‌పోతే తీవ్ర ఇబ్బందులు-Serious Problems if not Avoided
MOBILE
MOBILE

నిరంతర స్క్రీన్ ఫిక్సేషన్ రెప్పపాటు రేటును 50% తగ్గిస్తుంది, ఇది పొడి కంటి సిండ్రోమ్ , అకామోడేషన్ స్పాస్మ్‌లకు (దగ్గర మరియు దూర వస్తువుల మధ్య దృష్టిని మార్చడంలో ఇబ్బంది) దారితీస్తుంది. ఈ అలవాటు నియంత్రించకుండా ఇలాగే కొనసాగితే చిన్న వ‌య‌సులోనే దీర్ఘ‌కాలిక కంటి స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

త‌ర‌చూ త‌ల‌నొప్పి -Frequent headaches
headaches
headaches
రీల్స్ కార‌ణంగా నీలి కాంతి ప్రభావం వల్ల పెద్దలు కూడా తరచుగా తలనొప్పి, మైగ్రేన్ , నిద్ర రుగ్మతలను అనుభవిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పూట సెల్‌ఫోన్‌లో ఈ త‌ర‌హా వీడియోలు చూడ‌డం తీవ్ర ప‌రిణామాల‌కు దారి తీసే అవ‌కాశం ఉంది. రాత్రి ప‌డుకునే ముందు క‌నీసం రెండు గంట‌ల ముందే మొబైల్‌కు దూరంగా ఉండాల‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

2050 నాటికి 50 శాతం మందికి దృష్టి లోపం-50 percent of people will be visually impaired by 2050

2050 నాటికి ప్రపంచ జనాభాలో 50 శాతానికి పైగా మయోపిక్ అవుతారు, ఇది తిరిగి మార్చలేని అంధత్వానికి దారి తీస్తుంద‌ని ఇటీవ‌ల జ‌రిగిన అధ్య‌య‌నాల్లో బ‌య‌ట ప‌డింది.

 

మ‌యోపిక్ అంటే ఏంటి?-What is Myopic?

మయోపియా అంటే దగ్గర దృష్టి లోపం అని పిలుస్తారు. దూరంగా ఉన్న వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి, దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో క‌ళ్ల‌జోడు కూడా వీరికి ఇబ్బందులు తెచ్చే ప‌రిస్థితి ఉంటుంది. దూరంగా వ‌స్తువులు క‌నిపించేందుకు క‌ళ్ల‌ద్దాలు వాడినా..ద‌గ్గ‌ర వ‌స్తువులు చూసేందుకు క‌ళ్ల‌ద్దాలు అవ‌స‌రం ఉండ‌దు. దీంతో క‌ళ్ల‌ద్దాలు పెట్టుకున్న‌ప్పుడు ఒకలా..లేక‌పోతే మ‌రొలా ఉండ‌డంతో క‌ళ్ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉది. మయోపియా కంటి ఆకారం కాంతి కిరణాలు రెటీనా (కంటి వెనుక భాగంలో కాంతి-సున్నితమైన కణజాలం) పై నేరుగా దృష్టి పెట్టడానికి బదులుగా దాని ముందు దృష్టి సారించినప్పుడు సంభవిస్తుంది.

బాంధ‌వ్యాలు దూరం-Relationships Are Distant
RELEATIONSHIP
RELEATIONSHIP

రీల్స్ చూసే అలవాటు ఉన్న వాళ్లు దాదాపు ఒంటరిగా ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఇత‌రుల‌తో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఫీల‌వుతారు. ఎంత త్వ‌ర‌గా స‌మూహంలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేద్దామా అని ఆలోచిస్తుంటారు. అధిక వేగంతో, దృశ్యపరంగా ఉత్తేజపరిచే కంటెంట్ మొబైల్‌లో వీక్షిస్తూ బాంధ‌వ్యాల‌కు దూర‌మ‌వుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు , ఉద్యోగ నిపుణులు డిజిటల్ కంటి ఒత్తిడి, కళ్ళు వంకరగా అవ్వడం మరియు దృష్టి క్షీణించడం వంటి సమస్యలతో పోరాడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. నిరంతర రీల్ వినియోగంతో ముడిపడి ఉన్న సామాజిక ఒంటరితనం, మానసిక అలసట, ఓవర్‌లోడ్ కంటిపై భారం ప‌డుతున్నాయ‌ని చెబుతున్నారు.
రీల్స్ చిన్నవిగా ఉండవచ్చు, కానీ కంటి ఆరోగ్యంపై వాటి ప్రభావం జీవితాంతం ఉంటుందిష వైద్యులు హెచ్చరిస్తున్నారు.

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య వ‌య‌సు తేడా ఎంత ఉండాలి

0
newcouple
NEW COUPLE

మా అమ్మాయికి పెళ్లి కుదిరింది…అని చెబితే ఠ‌క్కున అబ్బాయి ఏం చేస్తున్నాడు. వ‌య‌సు ఎంత‌? అని అడుగుతారు. పెళ్లికి వృత్తి ఎంత ముఖ్య‌మో..వ‌య‌సు అంతే ముఖ్య‌మ‌ని భావిస్తారు. భార్య వ‌య‌సు కంటే భ‌ర్త వ‌య‌సు ఎక్కువ‌గా ఉండాల‌ని, క‌నీసం ఐదేళ్లైనా తేడా ఉండాల‌ని పెద్ద‌వాళ్ల భావన‌. ఇలా అయితే ఇద్ద‌రి ఆలోచ‌న‌లు మ్యాచ్ అవుతాయ‌ని న‌మ్మ‌కం. అయితే పెళ్లి వ‌య‌సుపై గ‌త కొంత‌కాలంగా చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. వ‌ధువు, వ‌రుడు మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం ఎంత ఉండాలన్న‌దానిపై నేటీ ఏఐ యుగంలో స్ప‌ష్ట‌త లేదు. చాలా మంది వ‌య‌సు అస‌లు ప‌నే లేదంటున్నారు.

COUPLE
COUPLE LOVE

ప్రేమ‌కు వ‌య‌సుతో ప‌నిలేదు-Love Has No Age

ప్రేమ‌కు వ‌య‌సుతో ప‌ని లేదు. పెళ్లికి మాత్రం వ‌య‌సు ముఖ్యం. దీనిని ఇరు క‌టుంబాలు గ‌ట్టిగానే ప‌ట్టించుకుంటాయి. ఉద్యోగంలో స్థిర‌ప‌డిన‌త‌రువాతే పెళ్లి అంటున్న నేటి యువ‌త‌రం…ఆ ముచ్చ‌ట తీరేస‌రికి మూడు ప‌దుల వ‌య‌సు దాటిపోతోంది. పైగా ఒకే ఆఫీసులో ప‌నిచేస్తూ వ‌య‌సుతో సంబంధం లేకుండా పెళ్లి పీఠ‌లెక్కుతున్న జంట‌లు అనేకం ఉన్నాయి. అమ్మాయి పెద్ద‌దా? అబ్బాయి వయ‌సు అమ్మాయి కంటే ప‌దేళ్లు ఉన్నా నో ప్రాబ్లం అంటున్నారు.

మ‌రి వీరి వ‌య‌సెంతో తెలుసా-And Do You Know How Old They Are?
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్మో , మోడల్ మీరా రాజ్‌పుత్ (15 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం) , నటి ప్రియాంక చోప్రా , అమెరికన్ గాయకుడు-గేయ రచయిత నిక్ జోనాస్ (ప్రియాంక 10 సంవత్సరాలు పెద్దవారు) వంటి భార్య భర్త కంటే పెద్దవారైన అనేక విజయవంతమైన వివాహాలు ఉన్నాయి. ఈ జంటలు సాంప్రదాయ నియమాలను ధిక్కరించాయి. అయినా దాంప‌త్య‌జీవితం సంతోషాల‌తో కొన‌సాగిస్తున్నారు.
COUPLE
COUPLE ROMANCE

ప్రేమ వివాహాల‌కు వ‌య‌సుతో ప‌నేంటి-What Does Age Have to do With Love Marriages?

ప్ర‌స్తుతం ప్రేమ వివాహాల సంఖ్య పెరుగుతూ వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు పంతాలు, ప‌ట్టింపుల‌కు పోయేవాళ్లు. ప్ర‌స్తుతం చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల ప్రేమ వివాహాల‌కు గ్రీన్ స‌గ్నల్ ఇస్తున్నారు. పైగా గ‌తం కంటే ఇప్పుడు అక్ష‌రాస్య‌త శాతం పెరుగుతూ వ‌స్తోంది. పిల్ల‌లు చ‌దువు పూర్త‌యిన త‌రువాత ఉద్యోగంలో చేరి త‌మ‌కు న‌చ్చిన అమ్మాయి, అబ్బాయిని ఎంచుకునే ప‌రిప‌క్వ‌త‌కు రావ‌డంతో త‌ల్లిదండ్రులు అడ్డు చెప్ప‌డం లేదు.

శాస్త్రం ఏమి చెబుతోంది?-What Does Science Say?

ఈ సాంఘిక నియమాలు కేవలం ఆచారాలు మాత్రమే అని కొందరు న‌మ్ముతున్న‌ప్ప‌టికీ.. ఈ విషయంలో శాస్త్రానికి కూడా ఒక అభిప్రాయం ఉంది. శాస్త్రం ప్రకారం, వివాహం గురించి ఆలోచించేటప్పుడు శారీరక, మానసిక పరిపక్వత చాలా అవసరం. అబ్బాయి కంటే అమ్మాయి సాధార‌ణంగా వేగంగా ప‌రిప‌క్వం చెందుతారు. బాలికలలో హార్మోన్ల మార్పులు 7 – 13 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతాయి, అయితే బాలురలో ఇది 9 మరియు 15 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది. ఫలితంగా, మహిళలు పురుషుల కంటే ముందుగానే భావోద్వేగ స్థిరత్వాన్ని ,మానసిక అవగాహనను పెంచుకుంటారు.

వివాహానికి వ‌య‌సు ఎంత‌?-What is The Age For Marriage?
ROMANTIC COUPLE
ROMANTIC COUPLE

భారతదేశంలో వివాహ వ‌య‌సు అమ్మాయికి 18 , అబ్బాయికి 21. ఈ సందర్భంలో, భార్యాభర్తల మధ్య 3 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం సాధారణంగా సరైనదిగా పరిగణిస్తారు. ఈ శాస్త్రీయ దృక్పథం ప్రధానంగా శారీరక పరిపక్వతను పరిష్కరిస్తుంది, కానీ వివాహం పూర్తిగా శారీరక అభివృద్ధిపై ఆధారపడి ఉండదని గమనించడం ముఖ్యం. వివాహానికి కనీస వయస్సు దేశాలలో మారుతూ ఉంటుంది.

భావోద్వేగ పరిపక్వత-Emotional Maturity

క‌నీస 4 నుండి 5 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉన్నప్పటికీ, విభిన్న స్థాయిల పరిపక్వతను గమనించవచ్చు. 10 నుంచి 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో గణనీయమైన వ్యత్యాసం ఉన్నప్పుడు, జీవిత అనుభవాలు చాలా భిన్నంగా ఉంటాయని ఫ్యామిలీ కౌన్సెల‌ర్లు చెబుతున్నారు.

వ‌య‌సు వ్య‌త్యాసం. ఆందోళనలు-Age Difference. Concerns

పెద్ద వయస్సు వ్యత్యాసాలు ఉన్న సంబంధాలలో ఉన్న వ్యక్తులు వృద్ధ భాగస్వామి యొక్క దీర్ఘాయువు గురించి ఎక్కువ ఆందోళనలను ఎదుర్కోవచ్చు. వృద్ధ భాగస్వామి మరణించినప్పుడు ఒంటరిగా మిగిలిపోతానేమోనని భాగస్వామి భయపడవచ్చు.

భార్య వ‌య‌సు ఎక్కువ ఉంటే-If The Wife is Older

ఇటీవ‌ల కాలంలో చేసుకోబోయే అమ్మాయి వయ‌సు ఎక్కువున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. ముఖ్యంగా ప్రేమ వివాహాల్లో ఇది జరుగుతుంది. వయసు ఎక్కువ ఉన్న‌ స్త్రీని వివాహం చేసుకోవడం అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. పెద్ద వ‌య‌సు ఉన్న‌ మహిళలు తమ గురించి తాము బాగా తెలుసుకుంటారు. ఆత్మవిశ్వాసం పుష్క‌లంగా ఉంటుంది. వారికి ఏమి కావాలో స్పష్టత ఉంటుంది. భ‌ర్త‌ను ఏ విధంగా చూసుకోవాలో పూర్తి అవ‌గాహ‌న క‌లిగి ఉంటారు.

న‌వ్వ‌క‌పోతే మీకే న‌ష్టం

0
smile
smile

నవ్వవయ్యా బాబూ….నీ సొమ్మేం పోతుంది…….నీ సోకేం పోతుంది.. అంటూ ఓ చిత్రంలో పాట బాగా పాపుల‌ర్ అయింది. సాధార‌ణంగా ఎవ‌రైనా న‌వ్వుతూ మాట్లాడుతుంటే చాలా ముచ్చ‌టేస్తుంది. వాళ్ల‌ను చూస్తే కాస్తా రిలీఫ్‌గా కూడా ఉంటుంది. అరె వాడు చూడు..రోజంతా న‌వ్వుతూనే ఉంటాడు…వాడు మ‌న ప‌క్క‌న ఉంటే పొట్ట‌చెక్క‌లైన‌ట్టే అనే మాట‌లూ తర‌చూ వింటుంటాం. న‌వ్వుకు ఉన్న ప‌వ‌ర్ అంతా ఇంతా కాదు. న‌వ్వుతూ ఉంటే ఏ రోగం ద‌రిచేరదు. ఎంత ఒత్తిడినైనా న‌వ్వుతో జ‌యించ‌వ‌చ్చు.

LAUGHING
laughing
మీకు ఈ అనుభ‌వం ఎదురయ్యే ఉంటుంది-You ill Have This Experience

ఔను నేను చెబుతుంది మీ కోస‌మే.. ప‌ని ఒత్తిడి ఉన్నా…బాగా అల‌సిపోయినా…టీవీలో వ‌చ్చే కామెడీ స్కిట్స్ గానీ, ఆయా చిత్రాల‌లో కామెడీ క్లిప్పింగ్స్ కానీ చూస్తే చాలా రిలాక్స్ అయిపోతాం. రిఫ్రెష్ అవుతాం. నవ్వుకు అంత బ‌లం ఉంది. బ‌ల‌హీన‌త‌ల‌ను అధిగ‌మించే ప‌వ‌రూ ఉంది. ఇంకెందుకు ఆల‌స్యం న‌వ్వుతూ చ‌దువుకుందాం.

నవ్వుతో ఒత్తిడి ఉపశమనం -Stress Relief With Laughter

మంచి హాస్యం అన్ని చాలా స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుంది. అనారోగ్యాలను నయం చేయదు, కానీ నవ్వడం వల్ల కలిగే సానుకూల దృక్ఫ‌థం మారుతుంది. ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డే వెసులుబాటు దొరుకుతుంది. చేసే ప‌నిని సులువు చేస్తుంది.

న‌వ్వితే న‌వ్వినంత కేల‌రీస్‌-Laughter Burns as Many Calories as you Llaugh

న‌వ్వితే న‌వ్వినంత కేల‌రీస్ పెరుగుతాయి. న‌వ్వ‌డంతో మీలో తెలియ‌ని వైబ్రేష‌న్ వ‌స్తాయి. మ‌న‌కు తెలియ‌కుండా అంత‌ర్గ‌త వ్యాయామం జ‌రుగుతుంది. ఎంత ఎక్కువసేపు నవ్వితే, ప్రభావాలు అంత ఎక్కువగా ఉంటాయి.

తాత్కాలిక ప్రయోజనాలు-Temporary benefits

మంచి నవ్వు తాత్కాలికంగా గొప్ప ప్రభావాలను కలిగి ఉంటుంది. మీరు నవ్వడం ప్రారంభించినప్పుడు, అది మీ మానసిక భారాన్ని తగ్గించడమే కాకుండా, మీ శరీరంలో శారీరక మార్పులను కూడా కలిగిస్తుంది. నవ్వు:

అవ‌య‌వాలు ఉత్తేజం-Organs Are Stimulated
GROUP SMILE
GROUP SMILE
న‌వ్వితే మ‌న అవ‌య‌వాలు ఉత్తేజంగా మార‌తాయి. న‌వ్వు ఆక్సిజ‌న్ రిచ్ గాలిని మీ శ‌రీరంలోకి తీసుకుంటుంది. మీ గుండె, ఊపిరితిత్తులు, కండరాలు ఉత్తేజ ప‌రుస్తాయి. మెద‌డు నుంచి విడుద‌ల చేసే ఎండార్పిన్‌ల‌ను పెంచుతుంది.
దీర్ఘకాలిక ప్రభావాలు-Long Term Effects
మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రతికూల ఆలోచనలు రసాయన ప్రతిచర్యలుగా మారి, మీ వ్యవస్థలోకి ఎక్కువ ఒత్తిడిని తీసుకురావడం ద్వారా మీ రోగనిరోధక శక్తిని తగ్గించడం ద్వారా మీ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. దీనికి విరుద్ధంగా, సానుకూల ఆలోచనలు వాస్తవానికి న్యూరోపెప్టైడ్‌లను విడుదల చేస్తాయి, ఇవి ఒత్తిడి మరియు తీవ్రమైన అనారోగ్యాలతో పోరాడటానికి సహాయపడతాయి.
మీకేది ఇష్ట‌మో గుర్తించండి-Figure Out What You LIke

మీరు ముభావంగా ఉంటున్నారా? అంద‌రూ న‌వ్వుతూ మాట్లాడుతుంటే మీరు న‌వ్వ‌లేక‌పోతున్నారా? ఇలాంటి వారు చాలా మంది మ‌న‌కు ఎదురయ్యే ఉంటారు. ఇలాంటివాళ్లు ముందుగా వారు న‌వ్వ‌లేక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాలు తెలుసుకోవాలి. న‌వ్వించే కొన్ని సాధార‌ణ అంశాల‌ను ఎంపిక చేసుకోండి. ఫన్నీ సినిమాలు, టీవీ షోలు, పుస్తకాలు, పత్రికలు లేదా కామెడీ వీడియోలను అందుబాటులో ఉంచండి. జోక్ వెబ్‌సైట్‌లు లేదా ఫన్నీ వీడియోలను ఆన్‌లైన్‌లో చూడండి. హాస్యభరితమైన పోడ్‌కాస్ట్‌లను వినండి. కామెడీ క్లబ్‌కు వెళ్లండి.

 

మీరు న‌వ్వితే లోక‌మే న‌వ్వుతుంది-If you Laugh, the World Laughs

ఒక్క‌సారి న‌వ్వుతూ మాట్లాడి చూడండి.. మీ చుట్టూ ఉన్న‌వాళ్లు మిమ్మ‌ల్ని ఎంత ఇష్ట‌ప‌డుతున్నారో అర్థ‌మ‌వుతుంది. మీరు న‌వ్వుతూ మాట్లాడితే లోక‌మే న‌వ్వుతుంది. న‌వ్వు రాక‌పోయినా న‌వ్వ‌డానికి ప్ర‌య‌త్నించండి. ప్రాక్టిస్ చేయండి. ఇది శ‌రీరానికి మంచి చేస్తుంది.

న‌వ్వు..ల‌వ్వు-Laugh..Laugh

COUPLE SMILE
COUPLE LAUGH

మీరు స‌మూహంలో న‌వ్వుతూ ఉండండి. మీకు కావాల్సిన వారు ప‌సిగ‌డతారు. ప్ర‌తి బంధం వెనుక న‌వ్వు కీల‌కం. న‌వ్వు ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతుంది. కలిసి నవ్వే వ్యక్తులు కలిసి బాగా పని చేస్తారు. మీరు కార్యాలయంలో సరదా వాతావరణాన్ని కలిగి ఉన్నప్పుడు, ఎక్కువ మంది పనికి రావడానికి సంతోషిస్తారు. వారి కమ్యూనికేషన్, ఒకరి పట్ల ఒకరి సహనం మెరుగ్గా ఉంటాయి.

న‌వ్వు..కుటుంబానికి ఇవ్వు-Laughter..Give it to The Family

ఇంట్లో న‌వ్వుతూ గ‌డ‌పండి. ఉద‌యం న‌వ్వుతూనే నిద్ర లేవండి…రాత్రి ప‌డుకునే ముందు న‌వ్వుతూనే ప‌డుకోండి. చిన్న చిన్న విష‌యాల‌కు చిరాకు ప‌డొద్దు…ఏ విష‌య‌మైనా న‌వ్వుతూ చెప్పండి. జీవితం మనకు అనేక ఆసక్తికరమైన విషయాలను విసురుతుంది . న‌వ్వుతూ జ‌యించాలి.

ల‌వ్ రిలేష‌న్‌-Love Relationship

మీ భాగస్వామితో నవ్వడం కంటే మంచిది మరొకటి లేదు. ఒక్కసారి ప్ర‌య‌త్నించి చూడండి. నిన్న‌టికి నేటికీ తేడా మీరే గ‌మ‌నిస్తారు. ఇది మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది.. ఆ క్షణంలో నిజంగా ఉండటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కలిసి నవ్వే చాలా జంటలు వారి సంబంధంలో అద్భుతంగా సాగుతుంది.

న‌వ్వులు ఏడు ర‌కాలు-Seven Types of Laughter

1.ముద్దులొలికే నవ్వు
2.వ్యంగ్య నవ్వు
3.నకిలీ నవ్వు
4.అసహ్యకరమైన నవ్వు
5. భయంతో కూడిన నవ్వు
6. దుష్ట నవ్వు
7. ఎక్కిళ్ల నవ్వు

రైస్‌తో కాళ్ల నొప్పుల‌కు చెక్‌

0
Check leg pain with rice
Check leg pain with rice

కోవిడ్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చాలా మంది నోట మోకాళ్ల నొప్పులు వింటున్నాం. వ్యాక్సిన్ వేసుకోవ‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పులు వ‌చ్చాయ‌ని చాలా మంది అపోహ ప‌డుతున్నారు. కార‌ణాలు ఏవైనా ప్ర‌స్తుతం 40 ఏళ్లు దాటిన వారంద‌ర్నీ కాళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. అలాగని నిత్యం యాంటిబ‌యెటిక్స్ వాడితే ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. అయితే ఇంటి వ‌ద్ద ఉంటూనే మోకాళ్ల నొప్పి త‌గ్గించుకోవ‌చ్చు. ఆ మార్గాలు ఏంటో చూద్దాం..

leg pain
leg pain

ఆర్థరైటిస్, లేదా తేలికపాటి గాయాల వల్ల కలిగిన నొప్పి సాధారణంగా వైద్య సహాయం లేకుండానే తగ్గిపోతుంది.అయితే, నొప్పి మోస్తరు నుంచి ఎక్కువ‌గా మిమ్మ‌ల్ని బాధ‌పెడితే క‌చ్చితంగా వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్లాల్సిందే. మీ మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే ప్రత్యామ్నాయ చికిత్సలు గురించి తెలుసుకుందాం.

రైస్‌తో రిలాక్స్‌ : RICE

కాళ్లు నొప్పులు, ప్ర‌మాద‌వ‌శాత్తూ జారి ప‌డితే రైస్ సూత్రాన్ని పాటించాలి. రైస్ సూత్రం అంటే ఏంటో తెలుసుకుందాం.

  • Rest (విశ్రాంతి)
    Ice (మంచు)
    Compression (కుదింపు)
    Elevation (ఎత్తివేయడం)

మీ కాళ్లకు విశ్రాంతినివ్వండి: 

leg pain
leg pain

వాపును నివారించడానికి మీ మోకాలకు కాంప్రెషన్ బ్యాండేజ్ బిగించండి, అయితే రక్త ప్రసరణ ఆగిపోకుండా ఉండేలా చూడండి. మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, వీలేతే ఎత్తు ప్ర‌దేశంలో ఉంచండి. విశ్రాంతి తీసుకునేట‌ప్పుడు మీ కాళ్ల ద‌గువున దిండు పెట్టుకోండి.

తాయి చీ (Tai Chi)
తాయి చీ అనేది ప్రాచీన చైనీస్ మైండ్-బాడీ వ్యాయామ విధానం, ఇది సమతుల్యత (balance) వంగే స్థితిని (flexibility) మెరుగుపరచుతుంది. తాయి చీ నొప్పిని తగ్గించడంలో మోకాలి కదలిక పరిమితిని పెంచడంలో సహాయపడుతుంది. దీని ద్వారా లోతైన శ్వాస , విశ్రాంతి పొందుతారు. ఈ లక్షణాలు ఒత్తిడిని తగ్గించడంలో దీర్ఘకాల నొప్పిని నిర్వహించడంలో కూడా సహాయపడతాయి.

వ్యాయామం: EXERCISE
రోజూ త‌గినంత వ్యాయామం చేయాలి. మీ కండరాల‌ను బ‌లంగా ఉంచ‌డానికి ఇది స‌హాయ ప‌డుతుంది. రోజూ క‌నీసం అర‌గంటైనా న‌డ‌వాలి. సైక్లింగ్, వాకింగ్‌, స్విమ్మింగ్ ఏదో ఒక‌టి మీకు అనుకూలంగా ఉన్న‌ది ఎంచుకుని ప్ర‌య‌త్నించాలి.

బరువు నిర్వహణ :Weight Management

అధిక బరువు , ఊబకాయం (obesity) మీ మోకాళ్ల జాయింట్లపై అదనపు ఒత్తిడిని పెంచుతాయి. ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం, అదనంగా 10 పౌండ్లు బరువు పెరిగితే, జాయింట్‌పై 15 నుండి 50 పౌండ్ల వరకు ఒత్తిడి పెరుగుతుంది.
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య వల్ల మీ మోకాళ్లలో నొప్పి వస్తున్నట్లయితే, బరువు తగ్గించడం ద్వారా జాయింట్‌పై ఒత్తిడిని తగ్గించి లక్షణాలను ఉపశమనించవచ్చు.

వెచ్చని ,చల్లని చికిత్స (Heat and Cold Therapy)

విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మోకాళ్ల నొప్పిని ఉపశమనించడానికి వెచ్చని ప్యాడ్ (heating pad) ఉపయోగకరంగా ఉంటుంది. చల్లని చికిత్స (cold treatment) ప్రదహనాన్ని (inflammation) తగ్గించడంలో సహాయపడుతుంది.చల్లదనంతో, వెచ్చదనంతో మారుతూ చికిత్స చేయండి. వెచ్చని ప్యాడ్‌ను 20 నిమిషాల పాటు మాత్రమే ఉంచండి.గాయమైన తర్వాత మొదటి 2 రోజులు, 20 నిమిషాల పాటు చల్లని ప్యాడ్‌లను రోజుకు 4 నుంచి 8 సార్లు పెట్టండి.గాయం అయిన తొలి 24 గంటల్లో జెల్ ప్యాక్ లేదా చల్లని ప్యాక్‌ను ఎక్కువసార్లు ఉపయోగించండి.

ఐస్‌ను నేరుగా చర్మంపై పెట్టకూడదు: Ice Should not be Applied Directly to the Skin
వేడి ప్యాడ్ అనవసరంగా వేడిగా లేదని పరీక్షించి పెట్టండి.ఫ్లేర్ (లక్షణాలు తీవ్రమయ్యే స్థితి) సమయంలో జాయింట్ వేడిగా ఉన్నప్పుడు, వేడి చికిత్సను ఉపయోగించకూడదు.ఉదయాన్నే గోరువెచ్చని షవర్ లేదా స్నానం గట్టి జాయింట్లను సడలించవచ్చు.

సుగంధ ద్రవ్యాల‌తో (Herbal Ointment)

2011లో జరిగిన ఒక అధ్యయనంలో, పరిశోధకులు కింది పదార్థాలతో తయారైన మలహం నొప్పిని తగ్గించడంలో ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో పరిశీలించారు

దాల్చిన చెక్క (cinnamon),అల్లం (ginger), నువ్వుల నూనె (sesame oil) వినియోగంతో నొప్పులు త‌గ్గించుకోవ‌చ్చు.ఏదైనా ప్రత్యామ్నాయ చికిత్సను ప్రయత్నించడానికి ముందు, డాక్టర్ లేదా ఫార్మసిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం.అల్లం టీ త‌ర‌చూ తాగాలి. వంట‌ల్లో కూడా అల్లం వినియోగించాలి. ఇలా త‌రుచూ చేస్తే మీ మోకాళ్ల నొప్పులు త‌గ్గ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.