నవ్వవయ్యా బాబూ….నీ సొమ్మేం పోతుంది…….నీ సోకేం పోతుంది.. అంటూ ఓ చిత్రంలో పాట బాగా పాపులర్ అయింది. సాధారణంగా ఎవరైనా నవ్వుతూ మాట్లాడుతుంటే చాలా ముచ్చటేస్తుంది. వాళ్లను చూస్తే కాస్తా రిలీఫ్‌గా కూడా ఉంటుంది. అరె వాడు చూడు..రోజంతా నవ్వుతూనే ఉంటాడు…వాడు మన పక్కన ఉంటే పొట్టచెక్కలైనట్టే అనే మాటలూ తరచూ వింటుంటాం. నవ్వుకు ఉన్న పవర్ అంతా ఇంతా కాదు. నవ్వుతూ ఉంటే ఏ రోగం దరిచేరదు. ఎంత ఒత్తిడినైనా నవ్వుతో జయించవచ్చు.

మీకు ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది-You ill Have This Experience
ఔను నేను చెబుతుంది మీ కోసమే.. పని ఒత్తిడి ఉన్నా…బాగా అలసిపోయినా…టీవీలో వచ్చే కామెడీ స్కిట్స్ గానీ, ఆయా చిత్రాలలో కామెడీ క్లిప్పింగ్స్ కానీ చూస్తే చాలా రిలాక్స్ అయిపోతాం. రిఫ్రెష్ అవుతాం. నవ్వుకు అంత బలం ఉంది. బలహీనతలను అధిగమించే పవరూ ఉంది. ఇంకెందుకు ఆలస్యం నవ్వుతూ చదువుకుందాం.
నవ్వుతో ఒత్తిడి ఉపశమనం -Stress Relief With Laughter
మంచి హాస్యం అన్ని చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అనారోగ్యాలను నయం చేయదు, కానీ నవ్వడం వల్ల కలిగే సానుకూల దృక్ఫథం మారుతుంది. ఒత్తిడి నుంచి బయటపడే వెసులుబాటు దొరుకుతుంది. చేసే పనిని సులువు చేస్తుంది.
నవ్వితే నవ్వినంత కేలరీస్-Laughter Burns as Many Calories as you Llaugh
నవ్వితే నవ్వినంత కేలరీస్ పెరుగుతాయి. నవ్వడంతో మీలో తెలియని వైబ్రేషన్ వస్తాయి. మనకు తెలియకుండా అంతర్గత వ్యాయామం జరుగుతుంది. ఎంత ఎక్కువసేపు నవ్వితే, ప్రభావాలు అంత ఎక్కువగా ఉంటాయి.
తాత్కాలిక ప్రయోజనాలు-Temporary benefits
మంచి నవ్వు తాత్కాలికంగా గొప్ప ప్రభావాలను కలిగి ఉంటుంది. మీరు నవ్వడం ప్రారంభించినప్పుడు, అది మీ మానసిక భారాన్ని తగ్గించడమే కాకుండా, మీ శరీరంలో శారీరక మార్పులను కూడా కలిగిస్తుంది. నవ్వు:
అవయవాలు ఉత్తేజం-Organs Are Stimulated

నవ్వితే మన అవయవాలు ఉత్తేజంగా మారతాయి. నవ్వు ఆక్సిజన్ రిచ్ గాలిని మీ శరీరంలోకి తీసుకుంటుంది. మీ గుండె, ఊపిరితిత్తులు, కండరాలు ఉత్తేజ పరుస్తాయి. మెదడు నుంచి విడుదల చేసే ఎండార్పిన్‌లను పెంచుతుంది.
దీర్ఘకాలిక ప్రభావాలు-Long Term Effects
మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రతికూల ఆలోచనలు రసాయన ప్రతిచర్యలుగా మారి, మీ వ్యవస్థలోకి ఎక్కువ ఒత్తిడిని తీసుకురావడం ద్వారా మీ రోగనిరోధక శక్తిని తగ్గించడం ద్వారా మీ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. దీనికి విరుద్ధంగా, సానుకూల ఆలోచనలు వాస్తవానికి న్యూరోపెప్టైడ్‌లను విడుదల చేస్తాయి, ఇవి ఒత్తిడి మరియు తీవ్రమైన అనారోగ్యాలతో పోరాడటానికి సహాయపడతాయి.
మీకేది ఇష్టమో గుర్తించండి-Figure Out What You LIke
మీరు ముభావంగా ఉంటున్నారా? అందరూ నవ్వుతూ మాట్లాడుతుంటే మీరు నవ్వలేకపోతున్నారా? ఇలాంటి వారు చాలా మంది మనకు ఎదురయ్యే ఉంటారు. ఇలాంటివాళ్లు ముందుగా వారు నవ్వలేకపోవడానికి గల కారణాలు తెలుసుకోవాలి. నవ్వించే కొన్ని సాధారణ అంశాలను ఎంపిక చేసుకోండి. ఫన్నీ సినిమాలు, టీవీ షోలు, పుస్తకాలు, పత్రికలు లేదా కామెడీ వీడియోలను అందుబాటులో ఉంచండి. జోక్ వెబ్‌సైట్‌లు లేదా ఫన్నీ వీడియోలను ఆన్‌లైన్‌లో చూడండి. హాస్యభరితమైన పోడ్‌కాస్ట్‌లను వినండి. కామెడీ క్లబ్‌కు వెళ్లండి.
మీరు నవ్వితే లోకమే నవ్వుతుంది-If you Laugh, the World Laughs
ఒక్కసారి నవ్వుతూ మాట్లాడి చూడండి.. మీ చుట్టూ ఉన్నవాళ్లు మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారో అర్థమవుతుంది. మీరు నవ్వుతూ మాట్లాడితే లోకమే నవ్వుతుంది. నవ్వు రాకపోయినా నవ్వడానికి ప్రయత్నించండి. ప్రాక్టిస్ చేయండి. ఇది శరీరానికి మంచి చేస్తుంది.
నవ్వు..లవ్వు-Laugh..Laugh

మీరు సమూహంలో నవ్వుతూ ఉండండి. మీకు కావాల్సిన వారు పసిగడతారు. ప్రతి బంధం వెనుక నవ్వు కీలకం. నవ్వు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. కలిసి నవ్వే వ్యక్తులు కలిసి బాగా పని చేస్తారు. మీరు కార్యాలయంలో సరదా వాతావరణాన్ని కలిగి ఉన్నప్పుడు, ఎక్కువ మంది పనికి రావడానికి సంతోషిస్తారు. వారి కమ్యూనికేషన్, ఒకరి పట్ల ఒకరి సహనం మెరుగ్గా ఉంటాయి.
నవ్వు..కుటుంబానికి ఇవ్వు-Laughter..Give it to The Family
ఇంట్లో నవ్వుతూ గడపండి. ఉదయం నవ్వుతూనే నిద్ర లేవండి…రాత్రి పడుకునే ముందు నవ్వుతూనే పడుకోండి. చిన్న చిన్న విషయాలకు చిరాకు పడొద్దు…ఏ విషయమైనా నవ్వుతూ చెప్పండి. జీవితం మనకు అనేక ఆసక్తికరమైన విషయాలను విసురుతుంది . నవ్వుతూ జయించాలి.
లవ్ రిలేషన్-Love Relationship
మీ భాగస్వామితో నవ్వడం కంటే మంచిది మరొకటి లేదు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. నిన్నటికి నేటికీ తేడా మీరే గమనిస్తారు. ఇది మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది.. ఆ క్షణంలో నిజంగా ఉండటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కలిసి నవ్వే చాలా జంటలు వారి సంబంధంలో అద్భుతంగా సాగుతుంది.
నవ్వులు ఏడు రకాలు-Seven Types of Laughter