ముద్దైన పద్ధతులెన్నో..
ప్రేమ పతాకం… మమతానురాగాల మధుర సంతకం ముద్దు. రెండు మనసుల మౌన సంభాషణం.. రెండు తనువుల మధ్య తొలి వలపుల సేతు బంధనం ముద్దు. అమ్మ మమతకు, నాన్న కరుణకు చెరగని గుర్తు బుగ్గలపై చిరు ముద్దు. కనులు కనులతో కలిసి, ఆపై వలపుల పూలు విరిసి, మనసులు మురిసి, మరులు కురిసి… చేతులు కలిసి, తనువులు చేరువయ్యే ఉబలాటంలో పెదాలు చేసే తొలి పలకరింపు యతీని ముద్దు. ఆర్తుల నొసటన దేవుడి ప్రేమను ముద్రించేదీ.. అలసటతో, అలజడితో విసిగివేసారిపోయే వారి శిరసున ఆప్యాయతానురాగాలు వర్షించేదీ మమతల ముద్దు. ముద్దు మనిషి జీవితంలో ఓ మధుర స్పర్శ. మమతల శ్వాస. ఓసారి ఆప్యాయంగా, ఓపరి ఓదార్పుగా, ఓ పర్యాయం ఆనందంగా… లాలనగా, కాంక్షగా, తమకంగా, తృప్తిగా … ఇన్ని మధుర భావాల వ్యక్తీకరణకు సాధనమైన ముద్దు ప్రేమకు తుది సరిహద్దు. మరి ప్రేమను వ్యక్తీకరించే ముద్దైన పద్ధతులేంటో తెలుసా మీకు?

బటర్‌ఫ్లై కిస్-Butterfly Kiss
సీతాకోకచిలుక మొహం మీద కదలాడితే ఎలా ఉంటుంది? ఈ ముద్దు అంత సుతారంగా ఉంటుంది. మీ ముఖాన్ని ముద్దు పెట్టుకునే ప్రియురాలి శ్వాస తగిలేంత చేరువగా తీసుకువెళ్లి.. ఆ సమయంలో ఆమె కనురెప్ప వాల్చిన వెంటనే తటాలున ముద్దు పెడితే మీరు ఆమెను ఎంత ఉద్వేగంతో ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది.
బుగ్గ మీద ముద్దు పెడితే..
If you kiss me on the cheek

ఇది స్నేహానికి సూచిక. ‘మనస్ఫూర్తిగా నీ స్నేహాన్ని కోరుకుంటున్నాను’ అని చెప్పడానికి బుగ్గ మీద ముద్దుతో ఎక్స్‌ప్రెస్ చెయ్యవచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్ భుజాలు రెండూ పట్టుకుని కళ్లల్లో స్వేచ్ఛాభావాన్ని ప్రతిఫలింపజేస్తూ బుగ్గ మీద ముద్దు పెడితే ఆ బంధం మరింత బలబడుతుంది.
ఎస్కిమో కిస్-Eskimo Kiss

ఎస్కిమోలు ధ్రువ ప్రాంతాల్లో ఉంటారన్నది తెలిసిందే. వారు తమ భాగస్వామికి పెట్టే ముద్దును ఎస్కిమో కిస్సంటారు. ముక్కుకు ముక్కు రాసుకుంటూ ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకుంటూ నెమ్మదిగా కిస్ చేయడం చల్లగా.. కూల్‌గా ఉంటుంది కదా.
నయన చుంబనం
A kiss that expresses your love for your partner

మీ భాగస్వామిపై మీ ప్రేమను తెలియజేసే కిస్ ఇది. నిత్యం ఈ విధంగా ముద్దాడుకోవడం వల్ల ఒకరికి ఒకరు కలకాలం నిత్యనూతనంగా అనిపిస్తారు. గువ్వా గోరింకల్లా కువకువలాడతారు. చేరువైన తరుణంలో తన్మయంతో మీ ఇష్టసఖి కనురెప్పలు మూసుకున్నప్పుడు నెమ్మదిగా వెన్న దొంగలించిన కృష్ణుడిలా ముద్దాడాలి.
ఫింగర్‌కిస్-Finger kiss

భాగస్వామి డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఓదార్చే సమయంలో చేతిపై పెట్టే ముద్దును ఫింగర్ కిస్ అంటారు. ఈ తరహా ముద్దు భారాభర్తలిద్దరికీ భరోసా ఇస్తుంది.
పాదసేవనం-Foot service

శృంగార రసాస్వాదనలో కీలకమైన ఈ ముద్దు అలనాడు సత్యభామకు శ్రీకృష్ణుడు పెట్టిందే. శృంగారం తొలిమెట్టెక్కాక భాగస్వామి పాదాలను పెదాలతో మృదువుగా స్పృశిస్తే.. ఓహ్.. ఆ ఆనందమే వేరేగా ఉంటుంది. ఆ సంతోషం స్వర్గం అంచుల వరకు తీసుకువెళ్తుంది. మొహంలో కనిపించే ఆ ఫీలింగ్ మీలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. గిలిగింతలతో మొదలై.. అలా ఎటో సాగిపోయేందుకు ఈ ముద్దు ప్రేరణగా నిలుస్తుంది.
ఫ్రూట్ కిస్-Fruit Kiss

ఆరోగ్యకరమైన ఈ కిస్ ఇంట్లో చేసిన ఫ్రూట్ సలాడ్ తిన్నట్టుంటుందంటే నమ్మండి! ద్రాక్ష, మామిడి, పైనాపిల్ పండ్లను చిన్న ముక్కలుగా తీసుకోండి. భాగస్వామి నోటికి ఒక్కో ముక్కను అందిస్తూ. వాటిని మునిపంట నొక్కి ముక్కలు చేస్తూ, ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తే శృంగారోద్దీపన బాగా జరుగుతుంది.
ఆగి ఆగి ముద్దాడుతూ-Stop and stop kissing

ఒకరి పెదాలతో ఒకరు మాటాడుకుంటున్నట్టు.. ఆగి ఆగి ముద్దాడే ఈ పద్ధతిలో బోలెడంత రిలీఫ్ దొరుకుతుందని మానసిక శాస్త్రవేత్తల ఉవాచ. ముద్దాడే వ్యక్తిని సున్నితంగా పట్టుకుని కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ, మనసులోని భావాలను వ్యక్తం చేస్తూ.. చిరుముద్దులు పెట్టుకునే విధానమిది. ఈ రకం కిస్ ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకునేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ఈ ముద్దు వల్ల ఆవేశం..కోపం చాలామట్టుకు తగ్గతుందంటున్నారు.
హాట్ అండ్ కూల్ కిస్-Hot and cool kiss

ఇది పడకగదిలో పెట్టుకునే కిస్. మీ భాగస్వామి దిగువ పెదవి మీ రెండు పెదాలతో అందుకుని మునిపంట నొక్కి పెట్టుకునే ముద్దు ఇది. ఇది చాలా ఉద్రేక పరిచే ముద్దు.
చిరు ఆభరణం-Small ornament
మీ భాగస్వామి మెడపై ఎన్ని ఆభరణాలున్నా.. మృదువుగా పెట్టుకునే ముద్దు ఇచ్చే అందం ఇంకేదిస్తుంది చెప్పండి? కంఠానికి ఇరువైపులా పెట్టే ఈ ముద్దు చల్లని ఒక శ్వాసలా అలరిస్తుంది. పేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఇందలో ఏ మాత్రం కామవాంఛ, మోహం ఉండవు. సంతోషం అతిశయిస్తే ఈ ముద్దు పెదాలపై ఓ ప్రభాత దరహాసంలా ఉదయిస్తుంది.
రివర్స్‌లిప్ కిస్-Reverse slip kiss

ఇది ప్రేమికుల ముద్దు. ప్రియురాలి అలక తీర్చడానికి ప్రియుడు ఈ రివర్స్ లిప్ కిస్‌ను ఉపయోగించుకుంటాడు. ప్రేయసి కుర్చీలో తల వెనుకకువాల్చి రిలాక్స్ అవుతున్న తరుణంలో… ప్రియుడు ఆమె వెనుక నుంచి వచ్చి.. వదనంపై పెదాలు ఆన్చి.. రెండు చేతుల్తో ఆమె మెడను పట్టుకుని దిగువ పెదవిపై తడి పెదాలతో ముద్దాడితే ఇక అలక తుర్రుమంటుంది.
తుమ్మెద ముద్దు-Firefly kiss
తమకం ఎక్కువై.. ప్రేయసిని ముద్దులతో ముంచెత్తే పద్ధతిది. మెడకు ఎడమవైపున లేదా, కుడివైపు కింద భాగంలో ముద్దు పెట్టుకుంటే అది తుమ్మెద ముద్దవుతుంది. పూవులో మకరందాన్ని. తుమ్మెద జుర్రుకునే విధంగా సాగే ఈ ముద్దు మత్తెక్కిస్తుంది. బుగ్గపై నెమ్మదిగా చేతితో నిమురుతూ పెదాలతో పెదాలను స్పృశిస్తే.. నువ్వంటే నాకు చాలాచాలా ఇష్టమని చెప్పకనే తెలిసిపోతుంది.
ముద్దుతో గుడ్ మార్నింగ్-Good morning with a kiss

చెంతనే ఉన్న సహచరి నిద్రలో ఊయలలూగుతున్న వేళ.. ఉదయాన్నే.. మృదువుగా గుడ్ మార్నింగ్ చెబుతున్నట్టు.. కనురెప్పలపై ముద్దుపెడుతూ నిద్రలేపండి….. ఇక ఆ రోజంతా ఉల్లాసమే.. మదిలో ఉత్సాహమే. అయినా భాషకందనిది.. భావాలకు అతీతమైనది ముద్దు.. దానికి డెఫినిషన్లు ఏమిటంటారా? మీ ముద్దు.. మీ ఇష్టం!
ముద్దు ముద్రలు-Kiss impressions
- చేతిమీద ముద్దు పెడితే…నీకోసం నే జీవిస్తున్నాను అని చెప్పడానికి
బుగ్గమీద ముద్దు పెడితే… మేం స్నేహితులం అని చెప్పేందుకు
నుదిటమై ముద్దు పెడితే..ఆత్మీయతానురాగాలకు ప్రతీక
మెడపై ముద్దు పెడితే…నువ్వునాక్కావాలి అని చెప్పడానికి
పెదాలపై ముద్దు పెడితే…నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి
చెవిపై ముద్దాడితే…ఆనందంగా వున్నాను అనిచెప్పడానికి.