- ప్రపంచాన్నీ వీక్షించవచ్చు
వైద్య శాస్త్రంలో అద్భుతం
అంధులు చూడగలిగేలా బ్లైండ్ సైట్ చిప్ - అంధులకు శుభవార్త. ఇకపై అంధులు కూడా ప్రపంచాన్ని చూడొచ్చు. అందాలు వీక్షించవచ్చు..తమ తల్లిదండ్రులు ఎలా ఉంటారో చూడొచ్చు..స్నేహితులతో కలిసి సినిమా చూడొచ్చు. విహార యాత్రలకు వెళ్లొచ్చు. వైద్యరంగంలో శాస్త్రవేత్తల అపూర్వ సృష్టికి అంధులంతా జేజేలు పలికే రోజు దగ్గర్లోనే ఉంది. 2025నాటికి అంధులకు బ్లైండ్ సైట్ చిప్ అమర్చేందుకు రంగం సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
-
BLIND CHIP - బ్లైండ్‌సైట్ అంటే ఏమిటి?-What is BlindSight?
‘బ్లైండ్‌సైట్’ అనేది ఒక కృత్రిమ దృశ్య ప్రోస్తేసిస్ (Artificial Visual Prosthesis), ఇది నేరుగా మెదడులోని విజువల్ కార్టెక్స్‌లో అమర్చబడుతుంది. ఇది ఒక మైక్రోఎలక్ట్రోడ్ చిప్, ఇది కెమెరా నుంచి అందుకున్న సిగ్నల్‌ను ప్రాసెస్ చేసి మెదడులో దృశ్య చిత్రాన్ని సృష్టిస్తుంది. అంటే, ఆప్టిక్ నరాలు దెబ్బతిన్న లేదా రెండు కళ్ళు లేని వారు కూడా చూడగలరు.
ఈ చిప్ ఎలా పనిచేస్తుంది?-How Does This Chip Work?

విజువల్ కార్టెక్స్‌లోని ఎలక్ట్రోడ్ల ద్వారా న్యూరాన్‌లను ప్రేరేపిస్తుంది. బాహ్య కెమెరా నుంచి అందుకున్న డేటాను ప్రాసెస్ చేసి మెదడులో దృశ్య చిత్రాన్ని రూపొందిస్తుంది. ప్రారంభంలో ‘అటారీ గ్రాఫిక్స్’ వంటి తక్కువ-రిజల్యూషన్ చిత్రాలు కనిపిస్తాయి, కానీ కాలక్రమేణా ‘సూపర్ హ్యూమన్ విజన్’ వరకు చేరుకోవచ్చు.
ఈ ఏడాది చివరినాటికి-By The End Of This Year

ఈ ఏడాదిచివరినాటికి అంధులు చూడగలిగే మొదటి పరికరాన్నిఅందుబాటులో తీసుకువచ్చేందుకు రంగం సిద్ధమైందని యూస్‌లో జరిగిన శాస్త్రవేత్తల సమావేశంలో ఎలాన్‌మస్క్ అనే శాస్త్రవేత్త వెల్లడిచారు. ఇప్పటికే దీనిపై పరిశోధనలు పూర్తి చేశామని, ప్రస్తుతం ట్రైల్ రన్‌లో ఉందని వెల్లడించారు. బ్లైండ్‌సైట్ అంధులకు “అటారీ గ్రాఫిక్స్” వంటి తక్కువ-రిజల్యూషన్ దృష్టిని మాత్రమే అందించగలదని చెప్పారు.
తక్కువ రిజల్యూషన్‌తో ప్రారంభం-Start With Low Resolution
తొలుత తక్కువ రిజల్యూషన్‌తో బ్లైండ్ సైట్ చిప్ అందుబాటులోకి రానుంది. కళ్లకు ఇబ్బంది లేకుండా రూపుదిద్దుకుంటోంది. కాలక్రమేణా ఇప్లాంట్ చివరికి మానవాతీతమైన దృష్టికి సాయపడుతుంది.
రెండు కళ్లు కోల్పోయినా వారు కూడా..-Even if They Lose Both Eyes

రెండుకళ్లు కోల్పోయిన వారు..ఆప్టిక్ నరాలు కోల్పోయిన వారు కూడా చూడగలిగేలా బ్లైండ్ సెట్ చిప్ అందుబాటులోకి రానుంది. పుట్టుకతోనే అంధులైన వారు కూడా మొదటిసారిగా చూడగలిగేలా చేస్తుంది.
నరాల కణాలను ప్రేరేపిస్తుంది-Stimulates Nerve Cells
బ్లైండ్ సైట్ చిప్ అత్యాధునిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. విజువల్ కార్టక్స్ పొందుపరిచారు. మైక్రోఎలక్ట్రోడ్ శ్రేణి కలిగి ఉంది. ఇది దృశ్య డేటాను ప్రాసెస్ చేస్తుంది. మెదడులోని భాగం..కెమెరా నుంచి ప్రసారం చేయబోయే నమూనాల ఆధారంగా విజువల్ కార్టెక్స్‌లో ఉన్న న్యూరాన్లు, నరాల కణాలను ప్రేరేపిస్తుంది.
ఎఫ్‌డీఏ ఆమోద ముద్ర-FDA Seal of Approval
బ్లైండ్ సైట్ చిప్ ను చాలా రోజులుగా పరిశీలించిన అనంతర గత ఏడాది సెప్టెంబర్‌లో యూస్ ఫుడ్ అడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ బ్రేక్ త్రూ హోదాను మంజూరు చేసింది. ప్రాణాంతక పరిస్థితులకు చికిత్స, రోగనిర్థారణ అందించే పరికరాలను పరిశీలించి ఆమోదముద్ర వేసేందుకు ఎఫ్‌డీఏ ప్రశంసమైన పాత్ర పోషిస్తోంది.
ఈ చిప్ విజయవంతమైతే..-If This Chip is Successful
నిజంగా ఈ చిప్ విజయవంతమైతే వైద్యశాస్త్రం, న్యూరోటెక్నాలజీలో చారిత్రాత్మక విప్లవానికి దారి తీస్తుందని చెప్పొచ్చు. మొదటిసారి అంధులు ప్రపంచాన్ని చూసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొందరు అంధులపై ఈ ప్రయోగం చేయనున్నారు. ఇది విజయంతమైతే మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.