హాయిగా నిద్రపోయి ఎన్ని రోజులైంది..ఎంత ట్రై చేసినా సరిగా నిద్ర పట్టటం లేదు..ఎక్కువసేపు పడుకుంటున్నట్టే ఉంటుంది..కానీ డీప్‌స్లీప్ లేదు…ఈ మాటలు తరచూ వింటుంటాం. పని ఒత్తిడి..నేటి బిజీ లైఫ్‌లో నిద్రకు ఇచ్చే స్థానం చివరి స్థానంలో ఉంటుంది. ప్రశాంతంగా పడుకునేవాళ్లు పసిపాపలే. ప్రస్తుత ప్రపంచంలో ఉదయ లేచిన దగ్గర నుంచి మిడ్‌నైట్ వరకు ఏదో వ్యాపకంతో నిద్రకు దూరమవుతున్నాం. అయితే మనం పడుకునే తీరులో కూడా మన ఆరోగ్యం ఆధారపడి ఉంది. అంతేకాదు ఇప్పుడిప్పుడే నిద్రకు కొత్త రూల్ ఒకటి బ్రహ్మాండంగా పనిచేస్తోంది. అదే 10-3-2-1-0.

జీవన శైలీ కారణమే..It’s Because of Lifestyle
ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో డబ్బు సంపాదన కీలకంగా మారింది. ఎంత ఎక్కువ సమయం కష్టపడితే అంత ఆదాయం సమకూర్చుకోగలమని చాలా మంది భావన. కార్పొరేట్ సంస్థలు కూడా ఉద్యోగులను ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్నాయి. టార్గెట్లు విధిస్తున్నాయి. ఇవి చేరకునేందుకు యువతీయువకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. ఒకవేళ పడుకున్నా…సరిగ్గా నిద్ర పట్టదు. నిద్రలేమి సమస్యలతో నేటి యువతరం అనారోగ్యానికి గురవుతోంది.
ఇలా చేయండి- do this
ఆరోగ్యకర జీవనానికి నిద్ర చాలా అవసరం. సరైన వ్యాయామం..పౌష్టికాహారం చాలా ముఖ్యం. మంచి నిద్ర మన పనితీరును ఉత్సాహ పరిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎంతసేపు పడుకున్నామో ముఖ్యం కాదు…ఎంతబాగా నిద్ర పట్టిందో చూసుకోవాలి.

నిద్ర లేకపోతే ప్రమాదాలెన్నో-Lack Of Sleep Can Lead to Many Dangers
నాణ్యమైన నిద్ర పొందకపోతే అనేక వ్యాధులు, రుగ్మతల తలెత్తే ప్రమాదముంది. గుండె వ్యాధులు, స్ట్రోక్, ఊబకాయం , మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్యకరమైన నిద్రలో మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి, ఒకటి, మీరు ఎంత సమయం నిద్రపోతున్నారు. రెండవది, నిద్ర నాణ్యత — అంతరాయాలు లేకుండా, చివరిది ఒక స్థిరమైన నిద్రపట్టు షెడ్యూల్. రాత్రిపూట షిఫ్ట్‌లు లేదా అనిశ్చితమైన షెడ్యూల్‌లలో పని చేసే వారు నాణ్యమైన నిద్ర పొందడం చాలా కష్టంగా భావిస్తారు. అలాగే, ప్రస్తుత మహమ్మారి వంటి తీవ్రమైన ఒత్తిడి సమయాలు, మన సాధారణ నిద్ర విధానాలను అడ్డుకుంటాయి.
నిద్రకు కొత్త ఫార్ములా 10-3-2-1-0-The New Formula For Sleep is 10-3-2-1-0.
- మీరు పడుకునేందుకు ఇవి కచ్చితంగా పాటించండి
10 గంటల ముందు: కాఫీ లేదా కెఫీన్ తాగకూడదు.
3 గంటల ముందు: ఆహారం లేదా మద్యం సేవించకూడదు.
2 గంటల ముందు: పనులు ఆపేయాలి.
1 గంట ముందు: స్క్రీన్ టైమ్‌కి స్వస్తి చెప్పాలి (ఫోన్‌లు, టీవీలు, కంప్యూటర్లు ఆపేయాలి).
0: ఉదయం అలారం మోగిన తర్వాత స్నూజ్ బటన్ నొక్కకూడదు.