మా అమ్మాయికి పెళ్లి కుదిరింది…అని చెబితే ఠక్కున అబ్బాయి ఏం చేస్తున్నాడు. వయసు ఎంత? అని అడుగుతారు. పెళ్లికి వృత్తి ఎంత ముఖ్యమో..వయసు అంతే ముఖ్యమని భావిస్తారు. భార్య వయసు కంటే భర్త వయసు ఎక్కువగా ఉండాలని, కనీసం ఐదేళ్లైనా తేడా ఉండాలని పెద్దవాళ్ల భావన. ఇలా అయితే ఇద్దరి ఆలోచనలు మ్యాచ్ అవుతాయని నమ్మకం. అయితే పెళ్లి వయసుపై గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. వధువు, వరుడు మధ్య వయసు వ్యత్యాసం ఎంత ఉండాలన్నదానిపై నేటీ ఏఐ యుగంలో స్పష్టత లేదు. చాలా మంది వయసు అసలు పనే లేదంటున్నారు.

ప్రేమకు వయసుతో పనిలేదు-Love Has No Age
ప్రేమకు వయసుతో పని లేదు. పెళ్లికి మాత్రం వయసు ముఖ్యం. దీనిని ఇరు కటుంబాలు గట్టిగానే పట్టించుకుంటాయి. ఉద్యోగంలో స్థిరపడినతరువాతే పెళ్లి అంటున్న నేటి యువతరం…ఆ ముచ్చట తీరేసరికి మూడు పదుల వయసు దాటిపోతోంది. పైగా ఒకే ఆఫీసులో పనిచేస్తూ వయసుతో సంబంధం లేకుండా పెళ్లి పీఠలెక్కుతున్న జంటలు అనేకం ఉన్నాయి. అమ్మాయి పెద్దదా? అబ్బాయి వయసు అమ్మాయి కంటే పదేళ్లు ఉన్నా నో ప్రాబ్లం అంటున్నారు.
మరి వీరి వయసెంతో తెలుసా-And Do You Know How Old They Are?
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్మో , మోడల్ మీరా రాజ్‌పుత్ (15 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం) , నటి ప్రియాంక చోప్రా , అమెరికన్ గాయకుడు-గేయ రచయిత నిక్ జోనాస్ (ప్రియాంక 10 సంవత్సరాలు పెద్దవారు) వంటి భార్య భర్త కంటే పెద్దవారైన అనేక విజయవంతమైన వివాహాలు ఉన్నాయి. ఈ జంటలు సాంప్రదాయ నియమాలను ధిక్కరించాయి. అయినా దాంపత్యజీవితం సంతోషాలతో కొనసాగిస్తున్నారు.

ప్రేమ వివాహాలకు వయసుతో పనేంటి-What Does Age Have to do With Love Marriages?
ప్రస్తుతం ప్రేమ వివాహాల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు పంతాలు, పట్టింపులకు పోయేవాళ్లు. ప్రస్తుతం చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమ వివాహాలకు గ్రీన్ సగ్నల్ ఇస్తున్నారు. పైగా గతం కంటే ఇప్పుడు అక్షరాస్యత శాతం పెరుగుతూ వస్తోంది. పిల్లలు చదువు పూర్తయిన తరువాత ఉద్యోగంలో చేరి తమకు నచ్చిన అమ్మాయి, అబ్బాయిని ఎంచుకునే పరిపక్వతకు రావడంతో తల్లిదండ్రులు అడ్డు చెప్పడం లేదు.
శాస్త్రం ఏమి చెబుతోంది?-What Does Science Say?
ఈ సాంఘిక నియమాలు కేవలం ఆచారాలు మాత్రమే అని కొందరు నమ్ముతున్నప్పటికీ.. ఈ విషయంలో శాస్త్రానికి కూడా ఒక అభిప్రాయం ఉంది. శాస్త్రం ప్రకారం, వివాహం గురించి ఆలోచించేటప్పుడు శారీరక, మానసిక పరిపక్వత చాలా అవసరం. అబ్బాయి కంటే అమ్మాయి సాధారణంగా వేగంగా పరిపక్వం చెందుతారు. బాలికలలో హార్మోన్ల మార్పులు 7 – 13 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతాయి, అయితే బాలురలో ఇది 9 మరియు 15 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది. ఫలితంగా, మహిళలు పురుషుల కంటే ముందుగానే భావోద్వేగ స్థిరత్వాన్ని ,మానసిక అవగాహనను పెంచుకుంటారు.
వివాహానికి వయసు ఎంత?-What is The Age For Marriage?

భారతదేశంలో వివాహ వయసు అమ్మాయికి 18 , అబ్బాయికి 21. ఈ సందర్భంలో, భార్యాభర్తల మధ్య 3 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం సాధారణంగా సరైనదిగా పరిగణిస్తారు. ఈ శాస్త్రీయ దృక్పథం ప్రధానంగా శారీరక పరిపక్వతను పరిష్కరిస్తుంది, కానీ వివాహం పూర్తిగా శారీరక అభివృద్ధిపై ఆధారపడి ఉండదని గమనించడం ముఖ్యం. వివాహానికి కనీస వయస్సు దేశాలలో మారుతూ ఉంటుంది.
భావోద్వేగ పరిపక్వత-Emotional Maturity
కనీస 4 నుండి 5 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉన్నప్పటికీ, విభిన్న స్థాయిల పరిపక్వతను గమనించవచ్చు. 10 నుంచి 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో గణనీయమైన వ్యత్యాసం ఉన్నప్పుడు, జీవిత అనుభవాలు చాలా భిన్నంగా ఉంటాయని ఫ్యామిలీ కౌన్సెలర్లు చెబుతున్నారు.
వయసు వ్యత్యాసం. ఆందోళనలు-Age Difference. Concerns
పెద్ద వయస్సు వ్యత్యాసాలు ఉన్న సంబంధాలలో ఉన్న వ్యక్తులు వృద్ధ భాగస్వామి యొక్క దీర్ఘాయువు గురించి ఎక్కువ ఆందోళనలను ఎదుర్కోవచ్చు. వృద్ధ భాగస్వామి మరణించినప్పుడు ఒంటరిగా మిగిలిపోతానేమోనని భాగస్వామి భయపడవచ్చు.
భార్య వయసు ఎక్కువ ఉంటే-If The Wife is Older
ఇటీవల కాలంలో చేసుకోబోయే అమ్మాయి వయసు ఎక్కువున్నా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ప్రేమ వివాహాల్లో ఇది జరుగుతుంది. వయసు ఎక్కువ ఉన్న స్త్రీని వివాహం చేసుకోవడం అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పెద్ద వయసు ఉన్న మహిళలు తమ గురించి తాము బాగా తెలుసుకుంటారు. ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉంటుంది. వారికి ఏమి కావాలో స్పష్టత ఉంటుంది. భర్తను ఏ విధంగా చూసుకోవాలో పూర్తి అవగాహన కలిగి ఉంటారు.