నిజమా? నాలుగు గంటల్లో ఏ గాయమైనా మానిపోతుందా? ఇదేం అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఉందే అనుకుంటున్నారు కదూ..ఔను ఇదో అద్భుతం..శాస్త్రవేత్తల మేథస్సులోంచి వచ్చిన ఆలోచనకు ప్రతిరూపం. గాయాలు త్వరగా మానేందుకు శాస్త్రవేత్తలు ఓ జెల్ ను కనుగొన్నారు. కేవలం ఈ జెల్ రాస్తే గాయం కేవలం 4 గంటల్లోనే దాదాపు 90 శాతం సరిచేస్తుంద. ఒక రోజులో పూర్తిగా నయం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్త హైడ్రోజెలు ఫిన్లాండ్ లోని ఆల్టో యూనివర్సిటీ, జర్మనీ లోని బైరైట్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి అభివృద్ధి చేశారు.
హైడ్రోజెల్‌లు మూడు పారిమాణాల (3D) నెట్‌వర్క్ నిర్మాణాలను కలిగి ఉన్న క్రాస్‌లింక్డ్ పాలీమర్ చైన్ సిస్టం. ఇవి ఎక్కువ పరిమాణంలో ద్రవాన్ని గ్రహించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. హైడ్రోజెల్‌ల అధిక నీటి శాతం, మృదువైన నిర్మాణం, రంధ్రాలతో కూడిన స్వభావం (porosity) కారణంగా, ఇవి జీవంత కణజాలాన్ని (living tissues) దగ్గరగా పోలి ఉంటాయి.
విభిన్న రంగాల్లో వినియోగం-Usage in Different Fields
ఇటీవల జరిగిన పరిశోధనల ప్రకారం, హైడ్రోజెల్‌లు వ్యవసాయం, బయోమెటీరియల్స్, ఆహార పరిశ్రమ, ఔషధ పంపిణీ (drug delivery), కణజాల ఇంజనీరింగ్ (tissue engineering), పునరుత్పత్తి వైద్యం (regenerative medicine) వంటి విభిన్న రంగాలలో ఉపయోగిస్తున్నారు.
కొనసాగుతున్న పరిశోధనలు-Ongoing research
ఉదాహరణకు, సిండెటిక్ హైడ్రోజెల్‌లు సహజంగా పూర్తిగా బయోడిగ్రేడబుల్ లేదా బయోకంపాటిబుల్ కావు. అయితే, వీటి ఫంక్షనల్ గ్రూప్‌లను సవరించడం లేదా సహజ పాలీమర్‌లను అనుసంధానం చేయడం ద్వారా వాటి బయోడిగ్రేడబిలిటీ బయోకంపాటిబిలిటీ మెరుగుపరచవచ్చు. కాబట్టి, హైడ్రోజెల్‌లను వివిధ వైద్య అప్లికేషన్‌ల కోసం అనుకూలంగా మార్చుకోవచ్చని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆసక్తిగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.