అదే పనిగా రీల్స్ చూస్తున్నారా? ఒక్క వీడియో…మరొక్క వీడియో అంటూనే గంటల కొద్దీ రీల్స్‌కు బానిసవుతున్నారా? అయితే మీ కళ్లు జాగ్రత్త. రీల్స్ వీక్షించడ కారణంగా యువకుల్లో కంటి రగ్మతులు పెరగడానికి అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ చూడడం వేరు…రీల్స్ చూడడం వేరు. రీల్స్ చూసేటప్పడు మన కళ్లురెప్ప వాల్చకుండా స్క్రీన్‌ను వీక్షించడం కారణంగా కళ్లకు తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. నిరంతరం స్క్రీన్ చూడడంతో ఫిక్సనేషన్ రెప్పపాటు రేటును 50 శాతం తగ్గిస్తుంది.

రీల్స్ చూడడం కొనసాగిస్తే…-If you Continue Watching Reels…
అదే పనిగా రీల్స్ చూడడం కొనసాగితే దృష్టి సమస్యలకు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న-రూప వీడియోల ప్రభావం మానసిక ఆరోగ్యంపై ఆందోళనలను రేకిత్తిస్తుందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
పిల్లలకు ఎక్కువ నష్టం-Children Suffer The Most

ఇప్పుడు పిల్లలు సెల్‌ఫోన్లకు ఎడిక్ట్ అవుతున్నారు. స్కూల్ నుంచి రాగానే తమ తల్లిదండ్రులు ఫోన్లు తీసుకుని రీల్స్ చూస్తున్నారు. గేమ్స్ ఆడుతున్నారు. ఇన్‌స్ట్రా గ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో రీల్స్‌ను ఎక్కువగా చూడడం వల్ల పిల్లలు, యువకుల్లో కంటి రుగ్మతలు పెరుగుతున్నాయి. యశోభూమి – ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌లో ప్రముఖ నేత్ర వైద్యులు ఈ విషయంపైనే ప్రధానంగా చర్చించుకున్నారు.
పిల్లల కళ్ళు వంకరగా..-The Children’s Eyes Are Crooked
ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మోలజీ (APAO) 2025 కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ లలిత్ వర్మ అధిక స్క్రీన్ ఎక్స్‌పోజర్ వల్ల కలిగే ‘డిజిటల్ కంటి ఒత్తిడి యొక్క నిశ్శబ్ద మహమ్మారిస పై తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. “రీల్స్‌ను గంటల తరబడి చూసే పిల్లలలో పొడి కంటి సిండ్రోమ్, మయోపియా పురోగతి, కంటి ఒత్తిడి మరియు ప్రారంభ దశలో కళ్ళు వంకరగా అవ్వడం వంటి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి” అని పేర్కొన్నారు.
నివారించకపోతే తీవ్ర ఇబ్బందులు-Serious Problems if not Avoided

నిరంతర స్క్రీన్ ఫిక్సేషన్ రెప్పపాటు రేటును 50% తగ్గిస్తుంది, ఇది పొడి కంటి సిండ్రోమ్ , అకామోడేషన్ స్పాస్మ్‌లకు (దగ్గర మరియు దూర వస్తువుల మధ్య దృష్టిని మార్చడంలో ఇబ్బంది) దారితీస్తుంది. ఈ అలవాటు నియంత్రించకుండా ఇలాగే కొనసాగితే చిన్న వయసులోనే దీర్ఘకాలిక కంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తరచూ తలనొప్పి -Frequent headaches

రీల్స్ కారణంగా నీలి కాంతి ప్రభావం వల్ల పెద్దలు కూడా తరచుగా తలనొప్పి, మైగ్రేన్ , నిద్ర రుగ్మతలను అనుభవిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పూట సెల్‌ఫోన్‌లో ఈ తరహా వీడియోలు చూడడం తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. రాత్రి పడుకునే ముందు కనీసం రెండు గంటల ముందే మొబైల్‌కు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
2050 నాటికి 50 శాతం మందికి దృష్టి లోపం-50 percent of people will be visually impaired by 2050
2050 నాటికి ప్రపంచ జనాభాలో 50 శాతానికి పైగా మయోపిక్ అవుతారు, ఇది తిరిగి మార్చలేని అంధత్వానికి దారి తీస్తుందని ఇటీవల జరిగిన అధ్యయనాల్లో బయట పడింది.
మయోపిక్ అంటే ఏంటి?-What is Myopic?
మయోపియా అంటే దగ్గర దృష్టి లోపం అని పిలుస్తారు. దూరంగా ఉన్న వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి, దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో కళ్లజోడు కూడా వీరికి ఇబ్బందులు తెచ్చే పరిస్థితి ఉంటుంది. దూరంగా వస్తువులు కనిపించేందుకు కళ్లద్దాలు వాడినా..దగ్గర వస్తువులు చూసేందుకు కళ్లద్దాలు అవసరం ఉండదు. దీంతో కళ్లద్దాలు పెట్టుకున్నప్పుడు ఒకలా..లేకపోతే మరొలా ఉండడంతో కళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉది. మయోపియా కంటి ఆకారం కాంతి కిరణాలు రెటీనా (కంటి వెనుక భాగంలో కాంతి-సున్నితమైన కణజాలం) పై నేరుగా దృష్టి పెట్టడానికి బదులుగా దాని ముందు దృష్టి సారించినప్పుడు సంభవిస్తుంది.
బాంధవ్యాలు దూరం-Relationships Are Distant

రీల్స్ చూసే అలవాటు ఉన్న వాళ్లు దాదాపు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. ఇతరులతో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఫీలవుతారు. ఎంత త్వరగా సమూహంలోంచి బయటకు వచ్చేద్దామా అని ఆలోచిస్తుంటారు. అధిక వేగంతో, దృశ్యపరంగా ఉత్తేజపరిచే కంటెంట్ మొబైల్‌లో వీక్షిస్తూ బాంధవ్యాలకు దూరమవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు , ఉద్యోగ నిపుణులు డిజిటల్ కంటి ఒత్తిడి, కళ్ళు వంకరగా అవ్వడం మరియు దృష్టి క్షీణించడం వంటి సమస్యలతో పోరాడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. నిరంతర రీల్ వినియోగంతో ముడిపడి ఉన్న సామాజిక ఒంటరితనం, మానసిక అలసట, ఓవర్‌లోడ్ కంటిపై భారం పడుతున్నాయని చెబుతున్నారు.
రీల్స్ చిన్నవిగా ఉండవచ్చు, కానీ కంటి ఆరోగ్యంపై వాటి ప్రభావం జీవితాంతం ఉంటుందిష వైద్యులు హెచ్చరిస్తున్నారు.