మీ జట్టు నల్లగా మారాలా? తెల్లవెంట్రుకలు మటుమాయం..మీ జుట్టు ఊడిపోతున్నా మేమున్నాం. మాప్రాడెక్ట్ వాడితే తెల్లగా ఉన్న జట్టు నల్లగా మారిపోతుంది. ఆ ఆయిల్ వాడితే మీ జుట్టులో ఒక్క తెల్ల వెంట్రుక కూడా ఉండదు. మీ జుత్తు ఊడిపోతుందన్న బాధకు మాదగ్గర సమాధానం ఉంది. సోషల్ మీడియా దగ్గర నుంచి టీవీలో యాడ్స్ వరకు మనల్ని ఊదరగొడుతూనే ఉంటాయి. ఇవి నిజమేనని చాలా మంది ఆయా ప్రాడెక్ట్‌లను కొనుగోలు చేసేందుకు వేలకు వేలకు ఖర్చు చేస్తున్నారు. అయినా ఫలితం పొందుతున్నారా? అంటే వందమందిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్ల నుంచి ఔను అన్న సమాధానం రాదు. అందుకే ఈ కథనం మీకోసం..

స్ప్లిట్ ఎండ్స్ అంటే-What are split ends?
స్ప్లిట్ ఎండ్స్ అంటే వెంట్రుకలకు చర్మంపై మొటిమలు వచ్చినట్టు. అయితే శరీరతత్వం..మనం తీసుకునే ఆహారం కారణంగా ప్రభావం చూపుతాయి. దీనినే క్యాష్ చేసుకుంటున్నాయి మార్కెట్లో హెయిర్ కేర్ ప్రాడెక్టులు. అయితే ఇదంతా డ్రామానేనా? అంటే ఔననే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మీ జుత్తు నాణ్యత ఎలా గుర్తించాలి-How to Determine the Quality of Your Hair
మీ జట్టు చివరి భాగాలను పరిశీలించండి. అవి రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా చీలిపోయిన ఉంటే అది స్ప్లిట్ ఎండ్స్ గా భావించవచ్చు. వెంట్రుకల బాహ్య రక్షణ పొర (క్యూటికల్) దెబ్బతింటే స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. ఈ రక్షణ పొర లేకుండా, లోపలి కార్టెక్స్ బయటికి తెరిచిపడుతుంది. ఇది వెంట్రుకలను బలహీనపరిచి చివరలు చీలిపోయేలా చేస్తుంది.

ఈ చీలిక నాలుగు రకాలు-There are four types of this fissure
బేసిక్ స్ప్లిట్: వై-ఆకారంలో చీలిక ఇది. ఇది క్యూటికల్ విడిపోయినప్పుడు కనిపిస్తుంది
ఫెదర్ స్ప్లిట్: ఒకే వెంట్రుకపై అనేక చీలికలు, ఇది తీవ్రమైన క్యూటికల్ నష్టాన్ని సూచిస్తుంది.
ట్రీ స్ప్లిట్: ఒకే బిందువు నుంచి అనేక చిన్న చీలికలు, ఇవి సాధారణంగా అత్యధికంగా ఎండిపోవడం వల్ల వస్తాయి.
నాటెడ్ స్ప్లిట్: వెంట్రుక గడ్డ కట్టుకోవడం, ఇది కర్లీ లేదా కాయిలీ హెయిర్ టైప్‌లో ఉంటుంది.
వీటికి గల కారణాలేంటి?-What Are the Reasons for These?

హీట్ స్టైలింగ్: ఫ్లాట్ ఐరన్లు, బ్లో డ్రైయర్ల వంటి స్టైలింగ్ టూల్స్ వల్ల అధిక వేడి కారణంగా వెంట్రుకలను బలహీనపరుస్తుంది. ఎక్కువ వేడి లేదా రక్షణ లేకుండా తరచుగా హెయిర్ డ్రేయర్స్ వాడితే వెంట్రుకలు లోపలి నుంచి పొంగుతాయి. ఇది క్యూటికల్ ను పగులకొట్టి, లోపలి భాగాన్ని బయటికి తెరుస్తుంది.
గట్టిగా దువ్వినా కష్టమే-It’s Hard to Comb it Tightly
చాలా మంది మన ఇళ్లల్లో ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లులు గట్టిగా దువ్వడం చూస్తూంటాం. అలా చేస్తే జుత్తుకు చాలా నష్టం. గట్టిగా దువ్వడం, టైట్ హెయిర్ స్టైల్స్ తరచూ వినియోగిస్తే భౌతిక ఒత్తిడులు గురికాకతప్పదు.
కెమికల్స్ తో నష్టం-Damage Caused by Chemicals
ఇప్పుడు 25 ఏళ్లు నిండకముందే జుత్తు తెల్లబడుతుంది. లేదా రంగు మారుతుంది. పొల్యూషన్, నిద్రలేమి, ఒత్తిడి ఈ మూడుకారణంగా కురుల్లో మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యలో చాలా మంది కలరింగ్, బ్లీచింగ్, హెయిర్ రిలాక్సింగ్ వంటి ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. దీంతో వెంట్రుకల సహజ నిర్మాణాన్ని విచ్ఛిన్నమవుతున్నాయి.
మీ జుత్తును మార్చే శక్తి ఉందా?-Do You Have the Power to Change Your Hair?
మార్కెట్లో ఊదరగొడుతున్న ప్రాడెక్ట్స్ కేవలం ప్రచారానికి మాత్రమే. నిజంగా మీజుత్తును మార్చే శక్తి వాటికి లేదు.అయితే పూర్తిగా నయం చేయనప్పటికీ కొన్ని కండిషనర్లు, లీవ్-ఇన్ ట్రీట్మెంట్లు వాటి రూపాన్ని తగ్గించగలవు.