చాలా మందికి నిత్యం తుమ్ములు, ఆవలింతలు, వెక్కిళ్లు వస్తుంటాయి. గమనించారా. ఆఫీసులో పనిచేస్తున్నా…కళాశాలలో పాఠాలు వింటున్నా…టీవీ చూస్తున్నా ఒక్కోసారి ఆవలింతలు రావడం గమనించే ఉంటారు. అలాగే షడన్ గా వెక్కిళ్లు వస్తుంటాయి. అయితే ఇవెందుకు వస్తాయి. ఇలా నిత్యం వస్తే అనారోగ్యమా? దీనికి నివారణ ఏంటో తెలుసుకుందాం.
మన శరీరం అనేక సహజ స్పందనలను (Reflex Actions) కలుగుతుంటాయి. ఇవి స్వచ్ఛందంగా కాకుండా, మన శరీరం మానసిక లేదా శారీరక మార్పుల కారణంగా జరిగే చర్యలు. ముఖ్యంగా తుమ్ములు, దగ్గులు, ఆవులింతలు, ఎక్కిళ్లు మన ఆరోగ్య పరిస్థితిని సూచించే సంకేతాలు.
తుమ్ములు -Sneezing

సాధారణంగా జులుబు చేసినప్పుడు తుమ్ములు వస్తుంటాయి. లేదా డస్ట్ ఎలర్జీ ఉంటే కూడా నిత్యం ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. తుమ్ము అనేది ముక్కులో ఉన్న దుమ్ము లేదా ఇతర జిడ్డు పదార్థాలను బయటికి పంపేందుకు శరీరం చేసే సహజ చర్య.
తుమ్ములు ఆపడం ఎలా? How to Stop Continuous Sneezing
ఎక్కువసార్లు తుమ్ముతూ ఉంటే మన శరీరం మొత్తం కదలిక వస్తుంటుంది. ఆస్త్మా రోగులకు తుమ్ములతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. తుమ్ముల కారణంగా నాసికా మార్గాలు క్లియర్ చేయడానికి ఆవిరి పీల్చడం మంచి రెమిడీ. అంతేకాకుండా విటమిన్ సీ ఉంటే ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఇంట్లో లభ్యమయ్యే వస్తువులు అల్లం, మిరియాలు, జీలకర్ర వంటి వాటితో టీ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా అలెర్జీలు, చలి, వాతావరణ మార్పులు, లేదా జలుబు కారణంగా తుమ్ములు వస్తాయి.
దగ్గు : Coughing

గొంతులో ఏదో అడ్డుపడినట్టు ఉండడం. గొంతు గరగరలాడడం..గొంతులో డస్ట్ చేరడం వంటివి తలెత్తినప్పుడు సాధారణంగా దగ్గు అనేది అందరికీ వస్తుంది. దగ్గు అనేది మీ శ్వాసనాళాలను శుభ్రంగా ఉంచడానికి రూపొందించిన ప్రతిచర్య. మీరు దగ్గుతున్నదానికి కారణం ఇతర పరిస్థితులు కావొచ్చు, ఉదాహరణకు ఆస్థమా లేదా శ్వాసకోశ సంక్రామణ లేదా మింగటానికి సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.
దగ్గుల రకాలు – Types of Cough
దగ్గుకు అనేక రకాలు ఉన్నాయి. కొన్ని దగ్గుల పేర్లు అవి ఎంత కాలం కొనసాగుతాయో తెలియజేస్తాయి, మరికొన్ని రకాలు వాటి ధ్వని లేదా అనుభూతిని వివరించగా, మరికొన్ని రకాలు వైద్య పరిభాషలో ప్రత్యేక పరిస్థితులను సూచిస్తాయి.
తీవ్రమైన దగ్గు -Acute Cough
ఈ దగ్గు అకస్మాతుగా ప్రారంభమవుతుంది. రోజుల తరబడి ఇబ్బంది పెడుతుంది. కనీసం రెండు మూడు వారాలు ప్రభావం చూపుతుంది. ఇటువంటి సమయంలో కచ్చితంగా వైద్యుడ్ని సంప్రదించాలి.
పాక్షిక దగ్గు -Subacute Cough
ఏదైనా అంటువ్యాధి తర్వాత సాధారణంగా ఈ దగ్గు మనకు ఇబ్బంది పెడుతుంటుంది. మూడు నుంచి ఎనిమిది వారాలు పాటు కొనసాగుతుంది.
దీర్ఘకాలిక దగ్గు -Chronic Cough
ఎన్ని మందులు వేసినా…కాఫ్ సిరఫ్‌లు తాగినా దగ్గు తగ్గదు. ఎనిమిది వారాలకు ఎక్కువ సమయం పాటు నిలిచే దగ్గు. దీన్ని స్థిరమైన దగ్గు (Persistent Cough) అని కూడా అంటారు. ఇది ఒక్కోసారి ప్రమాదానికి కూడా దారి తీస్తుంది. పొడి దగ్గు, తడి దగ్గు, దీర్ఘకాల దగ్గు లాంటి రకాలుగా దగ్గును వర్గీకరించవచ్చు.
ఆవలింతలు ఎందుకు వస్తాయా – What is the Reason for Yawning?

మన శరీరం అలసటకు గురైనా..బాగా నిద్ర వచ్చే సమయంలో…బాగా అలసిపోయిన సమయంలో నోరు తెరిచి గాలిని లోపలికి తీసుకునే ప్రక్రియే ఆవలింత. ఇది సాధారణంగా అలసట, నిద్ర వచ్చేటప్పుడు ఆవలింతలు వస్తుంటాయి.మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను సమతుల్యం చేసుకోవడానికి, అలసట తగ్గించడానికి అవలింతలు పెడతాం. దీని ప్రధాన కారణాలు నిద్రలేమి, బోరింగ్, మానసిక ఒత్తిడి. కొన్నిసార్లు, అవలింత ఒక సమూహపు వ్యక్తుల మధ్య ఉంటే, ఇతరులకు కూడా అవులింత రావడం మనం గమనించే ఉంటాం.
ఎక్కిళ్లు -Hiccups
ఎక్కిళ్ళు చిన్నపిల్లలు నుంచి పెద్దల వరకు ఎక్కిళ్లు వస్తుంటాయి. ఛాతీ ,పొత్తికడుపు మధ్య సన్నని కండరం అసంకల్పితంగా కుదించబడి మరియు బిగుతుగా ఉన్నప్పుడు ఎక్కిళ్ళు సంభవిస్తాయి. వేగంగా ఆహారం తినడం, అధికంగా గాలి మింగడం, లేదా మానసిక ఒత్తిడి వల్ల ఇవి రావచ్చు.
ఎక్కిళ్ళు ఎందుకు ఆగవు? Why don’t the Hiccups Stop?
కూల్ డ్రింక్‌లు అధికంగా తాగడం, అతిగా మద్యం సేవించడం, అతిగా తినడం, ఉత్సాహంగా ఉండడం, భావోద్వేగ ఒత్తిడికి గురికావడం, ఉష్ణోగ్రతల్లో మార్పులు, చూయింగ్ గమ్ నమలడం, ధూమపానం చేయడం కారణంగా 48 గంటలకు ఒక్కో సారి ఎక్కిళ్లు ఇబ్బంది పెడతాయి. దీంతో నరాల దెబ్బతినడం లేదా చికాకు, కేంద్ర నాడీ వ్యవస్థ లోపాలు, జీవక్రియ సమస్యలు ఏర్పడతాయి. తరుచూ ఇలా ఉంటే కచ్చితంగా వైద్యుడ్ని సంప్రదించాలి.
ఎక్కిళ్లు తగ్గాలంటే- To Reduce Hiccups
ఎక్కిళ్లు నివారించేందుకు ఉపయోగకరమైన విషయాలు : ఈ పద్ధతులను ఎక్కిళ్లు ఆపడానికి ఉపయోగపడతాయని ఎక్కువ మంది తమ అనుభావాలను బట్టి చెబుతున్నారు. అయితే ఇవి అందరికీ పనిచేస్తాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
ఇలా చేయాలి-This Should Be Done
- మోకాళ్లను మడిచి ఛాతీకి దగ్గరగా చేర్చుకొని ముందుకు వాలి కూర్చోండి.చల్లని మంచినీళ్లు మెల్లగా తాగండి.కొద్దిగా చక్కెర మింగండి.నిమ్మకాయను కొరకండి లేదా వెనిగర్ రుచి చూడండి.కొద్ది సేపు ఊపిరిని బిగించిపట్టుకోండి.
ఇలా చేయవద్దు-Don’t do this
- మద్యం, గ్యాస్ ఉన్న పానీయాలు లేదా వేడి పానీయాలు తాగవద్దు.బబల్ గమ్ నమకూడదు. పొగ తాగవద్దు – వీటి వల్ల గాలిని మింగే అవకాశం ఉంటుంది.మసాలా ఆహారం తినకండి.భోజనం చాలా వేగంగా తినకండి.వేడి ఆహారం లేదా పానీయం తీసుకున్న వెంటనే చాలా చల్లని ఆహారం తినకండి.
FAQ