Thursday, June 26, 2025
Home Blog Page 2

నిద్ర‌కు కొత్త ఫార్ములా 10-3-2-1-0

0
sleep formula
The new formula for sleep is 10-3-2-1-0 Follow these to help you sleep

హాయిగా నిద్ర‌పోయి ఎన్ని రోజులైంది..ఎంత ట్రై చేసినా స‌రిగా నిద్ర ప‌ట్ట‌టం లేదు..ఎక్కువ‌సేపు ప‌డుకుంటున్న‌ట్టే ఉంటుంది..కానీ డీప్‌స్లీప్ లేదు…ఈ మాట‌లు త‌ర‌చూ వింటుంటాం. ప‌ని ఒత్తిడి..నేటి బిజీ లైఫ్‌లో నిద్రకు ఇచ్చే స్థానం చివ‌రి స్థానంలో ఉంటుంది. ప్ర‌శాంతంగా ప‌డుకునేవాళ్లు ప‌సిపాప‌లే. ప్ర‌స్తుత ప్ర‌పంచంలో ఉద‌య లేచిన ద‌గ్గ‌ర నుంచి మిడ్‌నైట్ వ‌ర‌కు ఏదో వ్యాప‌కంతో నిద్ర‌కు దూర‌మ‌వుతున్నాం. అయితే మ‌నం ప‌డుకునే తీరులో కూడా మ‌న ఆరోగ్యం ఆధార‌ప‌డి ఉంది. అంతేకాదు ఇప్పుడిప్పుడే నిద్ర‌కు కొత్త రూల్ ఒక‌టి బ్ర‌హ్మాండంగా ప‌నిచేస్తోంది. అదే 10-3-2-1-0.

SLEEP WELL
DEEPSLEEP

జీవ‌న శైలీ కార‌ణ‌మే..It’s Because of Lifestyle

ఇప్పుడున్న పోటీ ప్ర‌పంచంలో డ‌బ్బు సంపాద‌న కీల‌కంగా మారింది. ఎంత ఎక్కువ స‌మయం క‌ష్ట‌ప‌డితే అంత ఆదాయం స‌మ‌కూర్చుకోగ‌ల‌మ‌ని చాలా మంది భావ‌న‌. కార్పొరేట్ సంస్థ‌లు కూడా ఉద్యోగుల‌ను ఎక్కువ గంట‌లు ప‌నిచేయించుకుంటున్నాయి. టార్గెట్లు విధిస్తున్నాయి. ఇవి చేర‌కునేందుకు యువ‌తీయువ‌కులు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. విశ్రాంతి లేకుండా ప‌నిచేస్తున్నారు. ఒక‌వేళ ప‌డుకున్నా…స‌రిగ్గా నిద్ర ప‌ట్ట‌దు. నిద్ర‌లేమి స‌మ‌స్య‌ల‌తో నేటి యువ‌తరం అనారోగ్యానికి గుర‌వుతోంది.

ఇలా చేయండి- do this

ఆరోగ్య‌క‌ర జీవ‌నానికి నిద్ర చాలా అవ‌స‌రం. స‌రైన వ్యాయామం..పౌష్టికాహారం చాలా ముఖ్యం. మంచి నిద్ర మ‌న ప‌నితీరును ఉత్సాహ ప‌రిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. ఎంత‌సేపు ప‌డుకున్నామో ముఖ్యం కాదు…ఎంత‌బాగా నిద్ర ప‌ట్టిందో చూసుకోవాలి.

HAPPY SLEEP
HAPPY SLEEP

నిద్ర లేక‌పోతే ప్ర‌మాదాలెన్నో-Lack Of Sleep Can Lead to Many Dangers

నాణ్యమైన నిద్ర పొందకపోతే అనేక వ్యాధులు, రుగ్మతల త‌లెత్తే ప్ర‌మాద‌ముంది. గుండె వ్యాధులు, స్ట్రోక్, ఊబకాయం , మతిమరుపు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌. ఆరోగ్యకరమైన నిద్రలో మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి, ఒకటి, మీరు ఎంత సమయం నిద్రపోతున్నారు. రెండవది, నిద్ర నాణ్యత — అంతరాయాలు లేకుండా, చివరిది ఒక స్థిరమైన నిద్రపట్టు షెడ్యూల్. రాత్రిపూట షిఫ్ట్‌లు లేదా అనిశ్చితమైన షెడ్యూల్‌లలో పని చేసే వారు నాణ్యమైన నిద్ర పొందడం చాలా కష్టంగా భావిస్తారు. అలాగే, ప్రస్తుత మహమ్మారి వంటి తీవ్రమైన ఒత్తిడి సమయాలు, మన సాధారణ నిద్ర విధానాలను అడ్డుకుంటాయి.

నిద్ర‌కు కొత్త ఫార్ములా 10-3-2-1-0-The New Formula For Sleep is 10-3-2-1-0.

  • మీరు ప‌డుకునేందుకు ఇవి క‌చ్చితంగా పాటించండి
    10 గంటల ముందు: కాఫీ లేదా కెఫీన్ తాగకూడదు.
    3 గంటల ముందు: ఆహారం లేదా మద్యం సేవించకూడదు.
    2 గంటల ముందు: పనులు ఆపేయాలి.
    1 గంట ముందు: స్క్రీన్ టైమ్‌కి స్వస్తి చెప్పాలి (ఫోన్‌లు, టీవీలు, కంప్యూటర్లు ఆపేయాలి).
    0: ఉదయం అలారం మోగిన తర్వాత స్నూజ్ బటన్ నొక్కకూడదు.

 

How to reduce hiccups and yawning?-ఎక్కిళ్లు..ఆవ‌లింత‌లు త‌గ్గేదెలా?

0
yawning 1
yawning 1

చాలా మందికి నిత్యం తుమ్ములు, ఆవ‌లింత‌లు, వెక్కిళ్లు వ‌స్తుంటాయి. గ‌మ‌నించారా. ఆఫీసులో ప‌నిచేస్తున్నా…క‌ళాశాల‌లో పాఠాలు వింటున్నా…టీవీ చూస్తున్నా ఒక్కోసారి ఆవ‌లింత‌లు రావ‌డం గ‌మ‌నించే ఉంటారు. అలాగే ష‌డ‌న్ గా వెక్కిళ్లు వ‌స్తుంటాయి. అయితే ఇవెందుకు వ‌స్తాయి. ఇలా నిత్యం వ‌స్తే అనారోగ్య‌మా? దీనికి నివార‌ణ ఏంటో తెలుసుకుందాం.

మన శరీరం అనేక సహజ స్పందనలను (Reflex Actions) క‌లుగుతుంటాయి. ఇవి స్వచ్ఛందంగా కాకుండా, మన శరీరం మానసిక లేదా శారీరక మార్పుల కారణంగా జరిగే చర్యలు. ముఖ్యంగా తుమ్ములు, దగ్గులు, ఆవులింతలు, ఎక్కిళ్లు మన ఆరోగ్య పరిస్థితిని సూచించే సంకేతాలు.

తుమ్ములు -Sneezing

sneezing
sneezing

సాధార‌ణంగా జులుబు చేసిన‌ప్పుడు తుమ్ములు వ‌స్తుంటాయి. లేదా డ‌స్ట్ ఎల‌ర్జీ ఉంటే కూడా నిత్యం ఈ స‌మ‌స్య వేధిస్తూ ఉంటుంది. తుమ్ము అనేది ముక్కులో ఉన్న దుమ్ము లేదా ఇతర జిడ్డు పదార్థాలను బయటికి పంపేందుకు శరీరం చేసే సహజ చర్య.

తుమ్ములు ఆప‌డం ఎలా? How to Stop Continuous Sneezing

ఎక్కువసార్లు తుమ్ముతూ ఉంటే మ‌న శరీరం మొత్తం క‌ద‌లిక వ‌స్తుంటుంది. ఆస్త్మా రోగుల‌కు తుమ్ముల‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతుంటారు. తుమ్ముల కార‌ణంగా నాసికా మార్గాలు క్లియ‌ర్ చేయ‌డానికి ఆవిరి పీల్చ‌డం మంచి రెమిడీ. అంతేకాకుండా విట‌మిన్ సీ ఉంటే ఆహారం తీసుకోవ‌డం ఉత్త‌మం. ఇంట్లో ల‌భ్య‌మ‌య్యే వ‌స్తువులు అల్లం, మిరియాలు, జీల‌క‌ర్ర వంటి వాటితో టీ తాగితే మంచి ఫ‌లితాలు ఉంటాయి. ముఖ్యంగా అలెర్జీలు, చలి, వాతావరణ మార్పులు, లేదా జలుబు కారణంగా తుమ్ములు వ‌స్తాయి.

దగ్గు : Coughing

couh
Coughing

గొంతులో ఏదో అడ్డుప‌డిన‌ట్టు ఉండ‌డం. గొంతు గ‌ర‌గ‌ర‌లాడ‌డం..గొంతులో డ‌స్ట్ చేర‌డం వంటివి త‌లెత్తిన‌ప్పుడు సాధార‌ణంగా ద‌గ్గు అనేది అంద‌రికీ వ‌స్తుంది. దగ్గు అనేది మీ శ్వాసనాళాలను శుభ్రంగా ఉంచడానికి రూపొందించిన ప్రతిచర్య. మీరు దగ్గుతున్నదానికి కారణం ఇతర పరిస్థితులు కావొచ్చు, ఉదాహరణకు ఆస్థమా లేదా శ్వాసకోశ సంక్రామణ లేదా మింగటానికి సమస్యలు తలెత్తితే వెంట‌నే వైద్యుడ్ని సంప్ర‌దించాలి.

దగ్గుల రకాలు – Types of Cough

దగ్గుకు అనేక రకాలు ఉన్నాయి. కొన్ని దగ్గుల పేర్లు అవి ఎంత కాలం కొనసాగుతాయో తెలియజేస్తాయి, మరికొన్ని రకాలు వాటి ధ్వని లేదా అనుభూతిని వివరించగా, మరికొన్ని రకాలు వైద్య పరిభాషలో ప్రత్యేక పరిస్థితులను సూచిస్తాయి.

తీవ్ర‌మైన ద‌గ్గు -Acute Cough

ఈ ద‌గ్గు అక‌స్మాతుగా ప్రారంభ‌మ‌వుతుంది. రోజుల త‌ర‌బ‌డి ఇబ్బంది పెడుతుంది. క‌నీసం రెండు మూడు వారాలు ప్ర‌భావం చూపుతుంది. ఇటువంటి స‌మ‌యంలో క‌చ్చితంగా వైద్యుడ్ని సంప్ర‌దించాలి.

పాక్షిక దగ్గు -Subacute Cough

 ఏదైనా అంటువ్యాధి తర్వాత సాధార‌ణంగా ఈ ద‌గ్గు మ‌న‌కు ఇబ్బంది పెడుతుంటుంది. మూడు నుంచి ఎనిమిది వారాలు పాటు కొనసాగుతుంది.

దీర్ఘ‌కాలిక ద‌గ్గు -Chronic Cough

ఎన్ని మందులు వేసినా…కాఫ్ సిర‌ఫ్‌లు తాగినా ద‌గ్గు త‌గ్గ‌దు. ఎనిమిది వారాలకు ఎక్కువ సమయం పాటు నిలిచే దగ్గు. దీన్ని స్థిరమైన దగ్గు (Persistent Cough) అని కూడా అంటారు. ఇది ఒక్కోసారి ప్ర‌మాదానికి కూడా దారి తీస్తుంది. పొడి దగ్గు, తడి దగ్గు, దీర్ఘకాల దగ్గు లాంటి రకాలుగా దగ్గును వర్గీకరించవచ్చు.

ఆవ‌లింత‌లు ఎందుకు వ‌స్తాయా – What is the Reason for Yawning?

Yawning
Yawning

మ‌న శరీరం అల‌స‌ట‌కు గురైనా..బాగా నిద్ర వ‌చ్చే స‌మ‌యంలో…బాగా అల‌సిపోయిన స‌మ‌యంలో నోరు తెరిచి గాలిని లోప‌లికి తీసుకునే ప్ర‌క్రియే ఆవ‌లింత‌. ఇది సాధార‌ణంగా అల‌స‌ట‌, నిద్ర వ‌చ్చేట‌ప్పుడు ఆవ‌లింత‌లు వ‌స్తుంటాయి.మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను సమతుల్యం చేసుకోవడానికి, అలసట తగ్గించడానికి అవ‌లింతలు పెడతాం. దీని ప్రధాన కారణాలు నిద్రలేమి, బోరింగ్, మానసిక ఒత్తిడి. కొన్నిసార్లు, అవ‌లింత ఒక సమూహపు వ్యక్తుల మధ్య ఉంటే, ఇతరులకు కూడా అవులింత రావడం మనం గ‌మ‌నించే ఉంటాం.

ఎక్కిళ్లు -Hiccups

ఎక్కిళ్ళు చిన్న‌పిల్ల‌లు నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఎక్కిళ్లు వ‌స్తుంటాయి. ఛాతీ ,పొత్తికడుపు మధ్య సన్నని కండరం అసంకల్పితంగా కుదించబడి మరియు బిగుతుగా ఉన్నప్పుడు ఎక్కిళ్ళు సంభవిస్తాయి. వేగంగా ఆహారం తినడం, అధికంగా గాలి మింగడం, లేదా మానసిక ఒత్తిడి వల్ల ఇవి రావచ్చు.

ఎక్కిళ్ళు ఎందుకు ఆగవు? Why don’t the Hiccups Stop?

కూల్ డ్రింక్‌లు అధికంగా తాగ‌డం, అతిగా మ‌ద్యం సేవించ‌డం, అతిగా తిన‌డం, ఉత్సాహంగా ఉండ‌డం, భావోద్వేగ ఒత్తిడికి గురికావ‌డం, ఉష్ణోగ్ర‌త‌ల్లో మార్పులు, చూయింగ్ గ‌మ్ న‌మ‌ల‌డం, ధూమ‌పానం చేయ‌డం కార‌ణంగా 48 గంట‌ల‌కు ఒక్కో సారి ఎక్కిళ్లు ఇబ్బంది పెడ‌తాయి. దీంతో నరాల దెబ్బతినడం లేదా చికాకు, కేంద్ర నాడీ వ్యవస్థ లోపాలు, జీవక్రియ సమస్యలు ఏర్ప‌డ‌తాయి. తరుచూ ఇలా ఉంటే క‌చ్చితంగా వైద్యుడ్ని సంప్ర‌దించాలి.

ఎక్కిళ్లు త‌గ్గాలంటే- To Reduce Hiccups

ఎక్కిళ్లు నివారించేందుకు ఉపయోగకరమైన విషయాలు : ఈ ప‌ద్ధ‌తుల‌ను ఎక్కిళ్లు ఆప‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఎక్కువ మంది త‌మ అనుభావాల‌ను బ‌ట్టి చెబుతున్నారు. అయితే ఇవి అంద‌రికీ ప‌నిచేస్తాయ‌నడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

ఇలా చేయాలి-This Should Be Done

  • మోకాళ్లను మ‌డిచి ఛాతీకి దగ్గరగా చేర్చుకొని ముందుకు వాలి కూర్చోండి.చల్లని మంచినీళ్లు మెల్లగా తాగండి.కొద్దిగా చక్కెర మింగండి.నిమ్మకాయను కొరకండి లేదా వెనిగర్ రుచి చూడండి.కొద్ది సేపు ఊపిరిని బిగించిపట్టుకోండి.

ఇలా చేయ‌వ‌ద్దు-Don’t do this

  • మద్యం, గ్యాస్ ఉన్న పానీయాలు లేదా వేడి పానీయాలు తాగవద్దు.బ‌బ‌ల్ గ‌మ్ నమకూడదు. పొగ తాగవద్దు – వీటి వల్ల గాలిని మింగే అవకాశం ఉంటుంది.మసాలా ఆహారం తినకండి.భోజనం చాలా వేగంగా తినకండి.వేడి ఆహారం లేదా పానీయం తీసుకున్న వెంటనే చాలా చల్లని ఆహారం తినకండి.

FAQ

తుమ్ము ఆపడానికి ఎలా?
ఎక్కిళ్ళు తగ్గాలంటే ఏ టాబ్లెట్ వాడాలి?

Uses of watermelon seeds-పుచ్చకాయ గింజలతో ఉపయోగాలు

0
Uses of watermelon seeds-పుచ్చకాయ గింజలతో ఉపయోగాలు

watermilon

  • ఆ విష‌యంలో పురుషుల‌కు ప్ర‌యోజ‌నం

వేస‌వి వ‌చ్చేసింది. ఎండ‌లు మండుతున్నాయి. ఈసారి సూర్యుడు మ‌రింత ప్ర‌తాపం చూపనున్నాడ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని. ఎక్కువ నీటి సాంద్ర‌త క‌లిగిన ప‌దార్థాలు తీసుకోవాల‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలం అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తొచ్చేది పుచ్చ‌కాయ‌లు. ఇవి అందరికీ స‌ర‌స‌మైన ధ‌ర‌ల్లోనే ల‌భిస్తున్నాయి.

పోష‌కాలు పుష్క‌లం-Nutrients Are Abundant

పుచ్చ‌కాయ‌ల్లో పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. ముఖ్యంగా వేస‌విలో ఇవి ఎక్కువ తీసుకుంటే చాలా ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. ఇందులో నీటి సాంద్ర‌త ఎక్కువ ఉండ‌డంతో దాహార్తి తీరుస్తుంది. అంతేకాకుండా శ‌రీరానికి శ‌క్తినిస్తుంది.

పుచ్చ‌కాయ‌ల గింజ‌లు-Watermelon Seeds

పుచ్చకాయ గింజల్లో మెగ్నీషియం, జింక్, ఐరన్, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. వీటిలో యాంటీ-ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మన శరీరాన్ని రక్షిస్తాయి. పుచ్చకాయ గింజలలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

చ‌ర్మానికి మేలు చేస్తాయి-Good for The Skin

ఈ గింజలు.. చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తాయి. ఈ గింజలలో అధిక మొత్తంలో విటమిన్ ఎ, ఇ ఉన్నాయి, ఇవి చర్మం, జుట్టుకు మేలు చేస్తాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. జుట్టును బలంగా, ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. పుచ్చకాయ గింజలతో మధుమేహాన్ని కూడా కంట్రోల్ చేయవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

షుగ‌ర్ కంట్రోల్‌-Sugar Control

పుచ్చకాయ లో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉన్నాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. డయాబెటిక్ రోగులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ గింజలు తినటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పుచ్చకాయ గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి.

Uses of watermelon seeds
water milon fruit

పుచ్చ‌కాయ‌ల సాగు-Watermelon Cultivation

పుచ్చకాయలు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా చైనా, టర్కీ, భారత్, ఇరాన్, మరియు బ్రెజిల్ విస్తృతంగా సాగు చేస్తున్నారు. భారతదేశంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు పుచ్చకాయల ప్రధాన ఉత్పత్తిదారులు గా ఉన్నాయి.

ఈ పుచ్చ‌కాయ చాలా స్వీట్ -This Watermelon is Very Sweet

పుచ్చ‌కాయ‌లు తీపిగా ఉంటాయ‌ని తెలుసు. కానీ అర్కాన్సాస్ పుచ్చ‌కాయ ప్ర‌పంచంలోనే అత్యంత తీపిగా ప్ర‌సిద్ధి చెందింది. అయితే, ఏ నగరం ఉత్తమమైన పుచ్చకాయలను ఉత్పత్తి చేస్తుందో అన్న విషయంలో అన్ని రాష్ట్రాలు విభేదిస్తూనే ఉన్నాయి.

పురుషుల‌కు ఆ లాభం ఎక్కువ -That Benefit is Greater for Men

పుచ్చ‌కాయ‌లు అంద‌రికీ ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. పిల్ల‌లు, పెద్ద‌లు, మ‌హిళ‌లు అంతా నిర‌భ్యంత‌రంగా తీసుకోవ‌చ్చు. అయితే పురుషుల‌కు పుచ్చ‌కాయ‌లు తిన‌డం వ‌ల్ల ఎక్కువ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. వీటిలో వృద్ధిగా వృద్ధి చెందిన వీర్య నాణ్యత, శృంగార ఆరోగ్యం, ప్రోస్టేట్ ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ వంటి అంశాలు ఉన్నాయి.

శృంగార ఆరోగ్యం -Sexual Health

పురుషులు పుచ్చకాయ తినడం ద్వారా వీర్య నాణ్యత, స్పెర్మ్ కౌంట్, మొబిలిటీ, మోర్ఫాలజీ మెరుగుపడుతుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది, ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి, శృంగార పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ప్రోస్టేట్ క్యాన్స‌ర్‌ను త‌గ్గిస్తుంది– Reduces Prostate Cancer

పుచ్చకాయ లైకోపీన్ (Lycopene) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌ను అందిస్తుంది, ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ప్రోస్టేట్ గ్లాండ్‌ను రక్షించడమే కాకుండా, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

water milon fruit
water milon fruit

బరువు త‌గ్గించ‌డానికి దోహ‌దం– Helps in Weight Loss
పుచ్చ‌కాలు తిన‌డం వ‌ల్ల వెయిట్ లాస్ కావొచ్చు. పుచ్చకాయ తక్కువ కాలరీలు , అధిక నీటి శాతం కలిగి ఉండటంతో బరువు నిర్వహణకు ఉపయోగపడుతుంది.

క‌ళ్ల‌కూ మంచిదే..Good For The Eyes Too..

పుచ్చకాయలో విటమిన్ A ఎక్కువగా ఉండటం వల్ల కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

FAQ:

What is the meaning of puchakaya?
What is the English word for peechinga?

నాలుగు గంట‌ల్లో మీ గాయం మాయం

0
Hydrogels
Your wound will heal in four hours

 

నిజమా? నాలుగు గంట‌ల్లో ఏ గాయ‌మైనా మానిపోతుందా? ఇదేం అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఉందే అనుకుంటున్నారు క‌దూ..ఔను ఇదో అద్భుతం..శాస్త్ర‌వేత్త‌ల మేథ‌స్సులోంచి వ‌చ్చిన ఆలోచ‌న‌కు ప్ర‌తిరూపం. గాయాలు త్వ‌ర‌గా మానేందుకు శాస్త్రవేత్తలు ఓ జెల్ ను కనుగొన్నారు. కేవ‌లం ఈ జెల్ రాస్తే గాయం కేవ‌లం 4 గంట‌ల్లోనే దాదాపు 90 శాతం స‌రిచేస్తుంద‌. ఒక రోజులో పూర్తిగా న‌యం అవుతుందని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఈ కొత్త హైడ్రోజెలు ఫిన్లాండ్ లోని ఆల్టో యూనివర్సిటీ, జర్మనీ లోని బైరైట్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి అభివృద్ధి చేశారు.


హైడ్రోజెల్‌లు మూడు పారిమాణాల (3D) నెట్‌వర్క్ నిర్మాణాలను కలిగి ఉన్న క్రాస్‌లింక్డ్ పాలీమర్ చైన్ సిస్టం. ఇవి ఎక్కువ పరిమాణంలో ద్రవాన్ని గ్రహించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. హైడ్రోజెల్‌ల అధిక నీటి శాతం, మృదువైన నిర్మాణం, రంధ్రాలతో కూడిన స్వభావం (porosity) కారణంగా, ఇవి జీవంత కణజాలాన్ని (living tissues) దగ్గరగా పోలి ఉంటాయి.

విభిన్న రంగాల్లో వినియోగం-Usage in Different Fields

ఇటీవల జరిగిన పరిశోధనల ప్రకారం, హైడ్రోజెల్‌లు వ్యవసాయం, బయోమెటీరియల్స్, ఆహార పరిశ్రమ, ఔషధ పంపిణీ (drug delivery), కణజాల ఇంజనీరింగ్ (tissue engineering), పునరుత్పత్తి వైద్యం (regenerative medicine) వంటి విభిన్న రంగాలలో ఉపయోగిస్తున్నారు.

కొన‌సాగుతున్న ప‌రిశోధ‌న‌లు-Ongoing research

ఉదాహరణకు, సిండెటిక్ హైడ్రోజెల్‌లు సహజంగా పూర్తిగా బయోడిగ్రేడబుల్ లేదా బయోకంపాటిబుల్ కావు. అయితే, వీటి ఫంక్షనల్ గ్రూప్‌లను సవరించడం లేదా సహజ పాలీమర్‌లను అనుసంధానం చేయడం ద్వారా వాటి బయోడిగ్రేడబిలిటీ బయోకంపాటిబిలిటీ మెరుగుపరచవచ్చు. కాబట్టి, హైడ్రోజెల్‌లను వివిధ వైద్య అప్లికేషన్‌ల కోసం అనుకూలంగా మార్చుకోవచ్చని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆసక్తిగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

 

Delicate in 21 days-21 రోజుల్లో నాజూగ్గా

0
slimfit
young woman measuring her waist with a tape measure
  • Kavi, Special Correspondent

నేడు ప్ర‌ధానంగా వేధిస్తున్న స‌మ‌స్య అధిక బ‌రువు. వెయిట్ లాస్ కోసం ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేసిన‌వాళ్లూ ఉన్నారు. నాజూగ్గా మారాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నవారు మ‌న‌కు తెలిసివాళ్లే చాలా మంది ఉన్నారు. డైట్ కంట్రోల్ చేస్తున్నామ‌ని..ఫుడ్ తిన‌డం త‌గ్గించేశామ‌ని, నిత్యం తినే ఆహారంలో చాలా ప‌దార్థాల‌ను దూరం పెట్టామ‌ని చెబుతుంటారు. అస‌లు నాజూగ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఏం తినాలి?? చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కేవ‌లం 21 రోజుల్లోనే మీరు ఫ‌లితం పొంద‌వ‌చ్చు. మీ శ‌రీరంలో మార్పులు చూడొచ్చు.

కొవ్వుతో స‌మ‌స్య‌లు-Problems ith Fat

ఒక వ్యక్తి శరీరంలో కొవ్వు అధికంగా చేరితే ఇబ్బందులు త‌ప్ప‌వు. డీహైడ్రేషన్, మెటాబాలిజం సమస్యలు, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు, గర్భధారణలో సమస్యలు అధిక వ‌ల్ల ఏర్ప‌డ‌తాయి. అందుకే ఏ డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లినా ముందు మ‌న వెయిట్ ఎంతో తెలుసుకుంటాడు.

ఇలా చేయండి..Do This..

తీపి ప‌దార్థాల‌కు దూరంగా ఉండండి Stay Away From Sweets
ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచే బెడ్ కాఫీ మొద‌లు..రాత్రి డిన్న‌ర్ అయ్యాక స్వీట్‌తో ముగిస్తారు చాలా మంది. ఇలా చేస్తే అధిక బ‌రువు స‌మ‌స్య‌లు క‌చ్చితంగా ఏర్ప‌డ‌తాయి. అందుకే మీరు చ‌క్కెర వినియోగం త‌గ్గించాలి. చక్కెరలో ఉండే హై ఫ్రక్టోజ్ అధికంగా శరీరంలో కొవ్వును పెంచి డయాబెటీస్, గుండె సమస్యలకు కార‌ణ‌మ‌వుతాయి.

slimfit
Portrait of beautiful young woman measuring her figure size with tape measure

రోజూ క‌నీసం 30 నిమ‌షాలు న‌డ‌వండి Walk For at Least 30 Minutes Every Day
మ‌న‌లో చాలా మంది వాకింగ్ చేయ‌రు. అస‌లు రోజూ వాకింగ్ చేస్తే చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ముఖ్యంగా అధిక బ‌రువు, కొవ్వు క‌ర‌గ‌డం వంటి ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.నడక అనేది చాలా సులభమైన , ప్రభావవంతమైన వ్యాయామం. 6.4 కిమీ/గం వేగంతో 30 నిమిషాలు నడవాలి.

జాగింగ్‌తో వేగంగా బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చు -You Can Lose Weight Quickly by Jogging
జాగింగ్ , రన్నింగ్ వల్ల చాలా వేగంగా బరువు తగ్గించుకోవచ్చు. 8 కిమీ/గం వేగంతో పరుగెత్తడం వల్ల 30 నిమిషాల్లో 298 కాలరీలు త‌గ్గ‌తాయి. ఇది ప్రాముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి సహాయపడుతుంది. రోజూ ఇలా చేయ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా నాజూగ్గా త‌యార‌వుతారు.

యోగాతో ఉప‌యోగాలు Uses With Ygga

యోగాతో కూడా అధిక బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చు. నిత్యం ఉద‌యం లేవ‌గానే కాసేపు యోగస‌నాలు వేస్తే ఈజీగా బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చు. అంతేకాకుండా మ‌న‌సు ప్ర‌శాంత‌త కూడా చేకూరుతుంది.

ఇంటి చిట్కాలు ఎంతో మేలు Home Tips are Very Good

1. దాల్చిన చెక్క టీ (Cinnamon Tea)
3-6 గ్రాముల దాల్చిన చెక్క పొడి నీటిలో మరిగించి, తేనె కలిపి ఉదయం మరియు రాత్రి తాగండి.

2. వాము నీరు (Ajwain for Weight loss)
రాత్రి వామును నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తాగండి..మంచి ఫ‌లితం ఉంటుంది.

3. హర్బల్ టీ
జీలకర్ర, ధనియాలు, వాము, సోంపు కలిపి టీగా మరిగించి తాగండి.

గోరువెచ్చని నీరు తాగడం Drinking warm water

ఉద‌యం లేచిన వెంట‌నే వేడినీటిలో అర స్పూన్ నిమ్మ‌ర‌సం క‌లుపుకుని తాగాలి. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీరు తాగడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు.
అశ్వగంధా (Ashwagandha for Weight loss)
అశ్వగంధా ఆకుల పేస్ట్ తయారు చేసి, ఉదయాన్నే తాగితే ఒత్తిడితో పెరిగిన బరువును తగ్గించుకోవచ్చు.

మీరు గోంగూర తింటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి

0
doyou eat sorrel leaves but know these-things
doyou eat sorrel leaves but know these-things

చాలా మంది ఆకు కూర‌లు తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. పిల్ల‌లైతే ఇక చెప్పాల్సిన ప‌ని లేదు. అయితే ఆకుకూర‌ల్లో ఉన్న అద్భుత ప్ర‌యోజ‌నాలు తెలిస్తే ఇక మీ మెనూలో త‌ప్ప‌నిస‌రిగా ఆకు కూర‌లు చేర్చ‌డం ఖాయం. అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించేందుకు గోంగూర‌ ఎంతగానో ఉప యోగపడుతుంది.దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

doyou eat sorrel leaves but know these-things
doyou eat sorrel leaves but know these-things

Kavi, Special Correspondent

మరణం గురించి స్టీఫెన్‌ హాకింగ్‌ మాటల్లో…

0
church, window, church window, picture, bible, christianity, stephen, stoning, jesus, christ, faith, apostles history, stephen, stephen, stephen, stephen, stephen

”మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం అనేదొక కట్టుకథ. మరణం తర్వాత జీవితం, స్వర్గం , నరకం వంటివేమీ లేవు. ఇవన్నీ మృత్యువు అంటే భయపడేవారి కోసం అల్లిన కట్టుకథలు. మనిషి మెదడు కూడా కంప్యూటర్‌ వంటిదే. విడిభాగాలు పాడైన తర్వాత కంప్యూటర్‌ పని చేయటం ఆగిపోయినట్టే మెదడు ఆగిపోతుంది. ఒక్కసారి మెదడు నిలిచిపోయిన తర్వాత ఏమీ ఉండదు. కన్నుమూసేలోపే మనకున్న శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండటానికి కృషి చేయాలి. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది. అయినప్పటికీ నేను మృత్యువుకు భయపడటం లేదు. త్వరగా మరణించాలని నేను భావించటం లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి”.